వైసీపీ పాలనలో అభివృద్ధి అధోగతిపాలు
ABN , First Publish Date - 2022-10-28T23:34:29+05:30 IST
వైసీపీ ప్రభు త్వపాలనలో రాష్ట్రం అన్నివిధాలా అధోగతి పాలైందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షాజహానబాషా ధ్వజమెత్తా రు.

రామసముద్రం, అక్టోబరు 28: వైసీపీ ప్రభు త్వపాలనలో రాష్ట్రం అన్నివిధాలా అధోగతి పాలైందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షాజహానబాషా ధ్వజమెత్తా రు. శుక్రవారం మండలానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వా మ్యం ఖూనీ అయిందన్నారు. అరాచకం, అవి నీతి, నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్‌పార్టీ పాలనలో 2004 నుంచి 2014 వరకు రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందిందన్నారు. వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఉపాధి అవకా శాలు లేకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు చైతన్యం కావా లని షాజహాన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కృష్ణప్ప, శ్రీనివాసులు, అనిల్‌కుమార్, వాలెప్ప, సీతప్ప తదితరులు పాల్గొన్నారు.