TDP: మంత్రి సబిత సమక్షంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు..
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:35 PM
మంత్రి సవిత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం పులివెందులలో జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో సమావేశంలో ఇరువర్గాలకు చెందినవారు బాహా బాహీకి దిగారు.

కడప జిల్లా: పులివెందుల (Pulivendula)లో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత (Minister Sabitha) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం (Telugu Desam Party wide-ranging meeting) జరిగింది. ఈ నేపథ్యంలో పులివెందుల టీడీపీలో విభేదాలు భగ్గు మన్నాయి. పార్టీ ఇన్చార్జ్ (TDP In charge) బీటెక్ రవి (BTech Ravi), టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి (TDP MLC Rangoopal Reddy)ల మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరు (Leadership fight) నడుస్తోంది. ఈ క్రమంలో మంగవారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఇరువర్గాలకు చెందినవారు బాహా బాహీకి దిగారు. మంత్రి సవిత సమీక్షలో బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి వర్గీయులు వివాదానికి దిగారు. వేదికపై కూర్చునేందుకు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వెళ్లారు. దీంతో ఆయన వేదికపై ఉండ కూడదని బీటెక్ రవి వర్గీయులు గొడవకు దిగారు. రాంగోపాల్ రెడ్డి కిందికి దిగిపోవాలని నినాదాలు చేశారు. నియోజకవర్గంపై తామే ఆధిపత్యం చెలాయించాలని ఇరువర్గాల వారు గొడవకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో సర్వసభ్య సమావేశం యధావిధిగా కొనసాగింది.
Also Read..: గవర్నర్ల అధికారాలపై సప్రీం స్పష్టత..
ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్సెస్ బీటెక్ రవి..
కాగా రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. అందుకే ప్రభుత్వ పాలన, పార్టీ కార్యక్రమాలు రెండింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు. అయితే పులివెందుల టీడీపీలో నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి వర్గాల మధ్య గత కొద్ది నెలలుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. ఇసుక టెండర్లు, రేషన్ డీలర్ల పోస్టుల విషయంలో విభేదాలు బయటపడ్డాయి. ఇసుక టెండర్ల తమ వారికే దక్కాలని, మరెవ్వరికీ ఇసుక టెండర్లు రావొద్దని బీటెక్ రవి వర్గీయులు కలక్టరేట్‌లో హడావుడి చేశారు. అది మరకముందే, రేషన్ డీలర్ల పోస్టులు తమ వర్గీయులకే దక్కాలని, మరెవ్వరినీ పరీక్షకు అనుమతించొద్దని బీటెక్ రవి వర్గం రాద్దాంతం చేసింది. దీంతో రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
ఇలాగైతే పార్టీని సంస్థాగతంగా నిర్మించడం సాధ్యం కాదని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేతల మధ్య సఖ్యత లేకపోతే పార్టీ బలోపేతం ఎలా అవుతుందని పలువురు కార్యకర్తలు అంటున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని, పులివెందులలో టీడీపీలో నెలకొన్న వర్గ, ఆధిపత్య పోరును చక్కదిద్దాలని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి కలిసి పనిచేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..
సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
For More AP News and Telugu News