AP News: ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఇంటి ముట్టడికి రైతుల యత్నం

ABN , First Publish Date - 2022-11-03T13:10:53+05:30 IST

ఆదోనిలో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు.

AP News: ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఇంటి ముట్టడికి రైతుల యత్నం

కర్నూలు: ఆదోనిలో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. న్యాయం చేయాలని పత్తి మొక్కలతో ఎమ్మెల్యే ఇంటి ముందు రైతులు నిరసన చేపట్టారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సాయిప్రసాద్... వెంటనే వ్యవసాయ శాఖ ఏడీఏను పిలిచి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే విధంగా చూసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Updated Date - 2022-11-03T13:10:54+05:30 IST

News Hub