కోదండరాముడిగా శ్రీరంగనాథుడు

ABN , First Publish Date - 2022-12-25T23:58:56+05:30 IST

నగరంలోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో జరుగుతున్న పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి కోదండరాముడి ఆలంకారం జరిగింది.

కోదండరాముడిగా శ్రీరంగనాథుడు
కోదండ రాముడి అలంకరణలో రంగనాథ స్వామి

నెల్లూరు (సాంస్కృతికం), డిసెంబరు 25 : నగరంలోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో జరుగుతున్న పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి కోదండరాముడి ఆలంకారం జరిగింది. ఉదయం ఆండాళ్‌ అమ్మవారికి అభిషేకాలు, ధనుర్మాసం పూజలు జరిగాయి. సాయంత్రం స్వామివారికి దివ్య నాలాయిర ఘోష్టి గానం, విశేష పూజలు జరిగాయి. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో రంగనాథస్వామి ఆలయం వద్ద ఆదివారం దుప్పట్ల పంపిణీ జరిగింది. బీజేపీ నాయకుడు మిడతల రమేష్‌, వీహెచ్‌పీ నాయకులు పాల్గొన్నారు.

వైకుంఠనాథన్‌గా వేణుగోపాలుడు

నగరంలోని మూలాపేట వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం గోదాదేవికి ధనుర్మాసం పూజలు జరిగాయి. సాయంత్రం పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వైకుంఠనాథన్‌ ఆలంకారం భక్తులకు కనువిందు చేసింది. చిన్నరుల నృత్య ప్రదర్శనలు ఆలరించాయి.

Updated Date - 2022-12-25T23:59:00+05:30 IST

News Hub