Share News

Train: రైలులో ప్రయాణికుల ఆభరణాలు చోరీ

ABN , Publish Date - Mar 21 , 2025 | 10:12 AM

మీరు రైలులో ప్రయాణిస్తున్నారా.. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో బొగీల్లోకి ఎక్కిన వారిలో కొందరు దొంగలుంటారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలులో జరిగిన దొంతనం గురించి చెబుతూనే జాగ్రత్తల గురించి చెబుతున్నారు.

Train: రైలులో ప్రయాణికుల ఆభరణాలు చోరీ

- రైలులో ప్రయాణికుల ఆభరణాలు చోరీ

హైదరాబాద్: రైలులో ప్రయాణికుల ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌(Dilsukhnagar)లో నివసిస్తున్న శ్రీలత(48) తిరుపతి నుంచి కాచిగూడకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌(Venkatadri Express) రైలులో వస్తోంది. గురువారం తెల్లవారు జామున డోన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో సిగ్నల్‌ కోసం రైలు ఆగగా ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును బోగీ కిటికీలో నుంచి దొంగలు లాక్కొని పారిపోయారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇందిరాపార్కులో టాయ్‌ ట్రైన్‌..


నంద్యాలకు చెందిన ప్రమీలమ్మ (55) గుంటూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌(Guntur - Kacheguda Express) రైలులో వస్తుంది. డోన్‌ రైల్వే స్టేషన్‌(Done Railway station) సమీపంలో ఆమె మెడలో ఉన్న తులంన్నర బంగారు మంగళ సూత్రాన్ని దొంగ లాక్కొని పారిపోయాడు. బాధితులు కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసులను కర్నూల్‌ రైల్వే పీఎస్‏(Kurnool Railway PS)కు‏ బదిలీ చేశామని సీఐ ఎల్లప్ప తెలిపారు.

city6.2.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

Online Betting: ముదిరిన బెట్టింగ్‌ వ్యవహారం.. తారలపై కేసులు

BJP: రాజాసింగ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?

Read Latest Telangana News and National News

Updated Date - Mar 21 , 2025 | 10:12 AM