AP News: హిందూ ఆలయాల పెయింటింగ్స్‌పై క్రైస్తవ మత ప్రచార రాతలు.. ఉద్రిక్తం
ABN , First Publish Date - 2022-12-14T15:05:10+05:30 IST
శ్రీకాకుళం సింహద్వారం జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం సింహద్వారం జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ గోడలపై మున్సిపల్ కార్పోరేషన్ వేయించిన అరసవిల్లి పుణ్యక్షేత్రం, హిందూ ఆలయాల పెయింటింగ్స్‌పై యేసే రక్షకుడు అంటూ పెయింట్స్‌తో క్రైస్తవ మతప్రచారకులు రాశారు. హిందూ ఆలయ నమూనాలపై క్రైస్తవ మత ప్రచార రాతలు రాయటంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. జై శ్రీరామ్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. క్రైస్తవ మత ప్రచార రాతలు రాసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోడలపై రాసిన మత ప్రచార రాతలను పోలీసులు పెయింటింగ్స్‌తో చెరిపించారు.