Lokesh: వైసీపీ ముఠాలు అరాచకాలకు పాల్పడుతున్నాయి
ABN , First Publish Date - 2022-12-30T18:07:48+05:30 IST
వైసీపీ ముఠాలు అరాచకాలకు పాల్పడుతున్నాయని టీడీపీ నేత లోకేష్ (Lokesh) ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో పుంగనూరు, తంబళ్లపల్లె (Punganur, Tamballapalle)లో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
విజయవాడ: వైసీపీ ముఠాలు అరాచకాలకు పాల్పడుతున్నాయని టీడీపీ నేత లోకేష్ (Lokesh) ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో పుంగనూరు, తంబళ్లపల్లె (Punganur, Tamballapalle)లో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నంజంపేటలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకల రాళ్ల దాడుల తీరును ఖండిస్తున్నామని తెలిపారు. దాడులు తీవ్రతరమైతే ప్రతిదాడులూ ఉంటాయని నారా లోకేష్ హెచ్చరించారు.
పుంగనూరు నియోజకవర్గంలోని పెద్దప్పరపల్లిలో ‘ఇదేమి ఖర్మ-రాష్ట్రానికి’ టీడీపీ (tdp) చేపట్టిన కార్యక్రమాన్ని వైసీపీ (ycp) శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ బాబు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆదరణ చూసి ఓర్వలేని వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ శ్రేణుల వాహనాలపై దాడులకు తెగబడ్డారు. టీడీపీకి చెందిన పలు వాహనాలు ధ్వంసం చేశారు. మరోవైపు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారు. ఇదిలా ఉంటే అధికార వైసీపీ శ్రేణులకు పోలీసులు(ap polices) సహకరించడం గమనార్హం.