MCD Elections: పోలింగ్ డిసెంబర్ 4, కౌంటింగ్ 7న

ABN , First Publish Date - 2022-11-04T17:32:52+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత కీలకంగా భావిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల షెడ్యూల్‌ను ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ శుక్రవారంనాడు ప్రకటించారు. నవంబర్ 7న నోటిఫికేషన్..

MCD Elections: పోలింగ్ డిసెంబర్ 4, కౌంటింగ్ 7న

న్యూఢిల్లీ: ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత కీలకంగా భావిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికల షెడ్యూల్‌ను ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ (Vijay Dev) శుక్రవారంనాడు ప్రకటించారు. నవంబర్ 7న నోటిఫికేషన్ వెలువడుతుంది. డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించనుండగా, డిసెంబర్ 7న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రిజర్వ్‌డ్ కేటగిరిలో 42కు పైగా వార్డులు ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలోని ఎంసీడీ వార్డుల సంఖ్య గతంలో 272 ఉండగా, దానిని 250కి కుదించారు. ఒకప్పడు మూడు మన్సిపాలిటీలుగా... ఈడీఎంఎస్, ఎస్‌డీఎంసీ, ఎన్‌డీఎంసీలుగా ఇవి ఉండేవి. బీజేపీ 15 ఏళ్ల పాటు ఈ మున్సిపాలిటీలను పాలించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ మూడు మున్సిపాలిటీలను ఎంసీడీ (MCD) పేరుతో కలిపేసింది. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది.

ఎంసీడీ ఎన్నికల పూర్తి షెడ్యూల్

-నోటిఫికేషన్ జారీ: నవంబర్ 7

-నామినేషన్ల ముగింపు: నవంబర్ 14

-నామినేషన్ల పరిశీలన: నవంబర్ 16

-నామినేషన్ల ఉపసంహరణ : నవంబర్ 19

-పోలింగ్ : డిసెంబర్ 4

-కౌంటింగ్, ఫలితాలు: డిసెంబర్ 7

-పోలింగ్ సమయం: ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.

Updated Date - 2022-11-04T17:32:53+05:30 IST