Share News

AR Rahman : ఎమర్జెన్సీ వార్డులో ఏఆర్ రెహమాన్.. స్పందించిన కుమారుడు..

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:35 PM

AR Rahman Health Update : ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ( AR Rahman) ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. తండ్రి అస్వస్థతపై గురించి ఆయన కుమారుడు సోషల్ మీడియా వేదికగా ఇలా స్పందించాడు.

AR Rahman : ఎమర్జెన్సీ వార్డులో ఏఆర్ రెహమాన్.. స్పందించిన కుమారుడు..
AR Rahman

AR Rahman Health Update : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారనే వార్తలు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారని తెలియడంతో మరింత కలవరపాటుకు గురయ్యారు. అయితే, తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారనే వార్తలను ఆయన సోదరి రిహానా ఖండించారు. డిహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యల కారణంగా అప్పటికప్పుడు ఆస్పత్రికి వెళ్లామని ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ అపోలో ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. డీహైడ్రేషన్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్‌కు రొటీన్ చెకప్స్ నిర్వహించి డిశ్చార్జి చేస్తున్నట్లు వెల్లడించారు.


నాన్న అస్వస్థతపై కొడుకు రియాక్షన్..

మాపై ఎంతో ప్రేమ కురిపిస్తూ మద్ధతుగా నిలబడి నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు. మా నాన్నగారు డీహైడ్రేషన్ కారణంగా నీరసంగా అయిపోవడంతో రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం చాలా బాగుందని మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ మాటలు, ఆశీస్సులు, అవధుల్లేని ప్రేమ మాకెంతో అపురూపమైనవి. కష్టంలో మా వెన్నంటే నిలిచి మద్ధతుగా నిలబడినందుకు అభినందనలు.


Read Also : AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Delhi Air Quality: రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. మూడేళ్లలో కొత్త రికార్డు!

Ranya Rao: 15 చెంపదెబ్బలు కొట్టారు

Updated Date - Mar 16 , 2025 | 01:19 PM