మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-10-23T00:42:46+05:30 IST

ప్రపంచంలో ఐదు రకాల ఖడ్గ మృగాలుంటాయి. ఆఫ్రికాలో ఉండేవి నలుపు, తెలుపు రంగుతో పాటు రెండు కొమ్ములుంటాయి. ఇక మిగతా ఖండాల్లోవి మూడు రకాలుంటాయి.

మీకు తెలుసా?

ప్రపంచంలో ఐదు రకాల ఖడ్గ మృగాలుంటాయి. ఆఫ్రికాలో ఉండేవి నలుపు, తెలుపు రంగుతో పాటు రెండు కొమ్ములుంటాయి. ఇక మిగతా ఖండాల్లోవి మూడు రకాలుంటాయి. ముఖ్యంగా మనదేశంతో పాటు నేపాల్‌లో ఒక్క కొమ్ము ఖడ్గ మృగాలు అధికం. రినో ఫౌండేషన్‌ లెక్కల ప్రకారం.. కజిరంగా నేషనల్‌ పార్క్‌లోనే 2600కి పైగా ఇవి ఉన్నాయి.

మగ ఖడ్గమృగాన్ని బుల్‌, ఆడ జంతువులను ‘కౌ’ అంటారు.

ఒక యుక్తవయసు ఖడ్గమృగం బరువు సుమారు టన్ను ఉంటుంది. భారీ ఖడ్గమృగం కనీసం మూడు టన్నులుంటుంది. ఇంత పెద్ద జంతువైనా ఇది శాకాహారి. గడ్డి తిని బతుకుతుంది.

వీటి కొమ్ము 7 సెం.మీ పెరుగుతుంది. అత్యధికంగా 150 సెం.మీ వరకూ పెరుగుతుంది. మనకు గోర్లు, వెంట్రుకలు తయారయ్యే కెరోటిన్‌ వల్లనే ఈ కొమ్ములు ఏర్పడతాయి. అయితే ఈ కొమ్ములు అత్యంత కఠినంగా ఉంటాయి. ఏ జంతువైనా దీని బారినపడితే ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందే.

వీటికో బలహీనత ఉంది. వీటి చూపు తక్కువ ఉంటుంది. 30 మీటర్లు దూరంలో ఉండే వస్తువైనా, ఇతర జంతువైనా కనపడదు. అయితే ఇవి స్మెల్‌తోనే దగ్గర్లో ఉండే ఇతర జీవిని పసిగడతాయి.

ఈ జంతువులకు బురదంటే మహాఇష్టం. బురదను కోట్‌లా వేసుకుంటే కూల్‌గా, రిలాక్స్‌గా ఫీలవుతాయి. ముఖ్యంగా దోమ కాటులనుంచి ఉపశమనం వీటికి కలుగుతుంది. ఆఫ్రికా జంతువులతో పోలిస్తే ఆసియాలోని ఖడ్గమృగాలు ఈదటంలో పర్ఫెక్ట్‌. నదులను సులువుగా దాటుతాయి.

ఖడ్గమృగాలు కొమ్ములతో వేటినైనా చంపగలవు. అయితే వాటి కొమ్ములకోసం అవి చంపబడతాయి. వియత్నాం లాంటి దేశాల్లో వీటి కొమ్ములు ఉండటం స్టేటస్‌ సింబల్‌గా ఫీలవుతారు. చైనాతో పాటు ఆసియా దేశాల్లో వీటి శరీరభాగాలను కొన్ని రోగాల నివారణకోసం వాడతారు. ఈ పదేళ్లలో 7వేల ఖడ్గమృగాలు స్మగ్లర్స్‌ బారిన పడ్డాయి. హెలికాప్టర్స్‌లో వచ్చి కాల్చి కేవలం పదినిమిషాల్లోనే వీటిని ఎత్తుకెళ్లే గ్యాంగ్స్‌ ఉన్నాయి. దీంతో ఎన్నో స్వచ్ఛంధ సంస్థలు వీటిని కాపాడటానికి ముందుకొచ్చాయి. రినో ఫౌండేషన్‌ ప్రపంచంలోని ఖడ్గమృగాలకోసమే ఉంది.

Updated Date - 2022-10-23T00:45:57+05:30 IST