చేపలు పట్టేందుకు వెళ్లిన జాలరి.. సముద్రం ఒడ్డున నీటిపై తేలుతున్న ఓ ఆకారం.. దగ్గరకెళ్లి చూస్తే..
ABN , First Publish Date - 2022-11-26T15:14:31+05:30 IST
మహిళ ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి..
పెరూ లోని హువాచో సిటీ బీచ్ లో చేపలు పట్టే ఓ వ్యక్తి ఎప్పటిలాగే చేపలు పట్టడానికి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. అతనికి కొంచెం దూరంలో సముద్రం మీద తేలియాడుతూ ఓ మృతదేహం కనిపించింది. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఆ శరీరం చిన్నాబిన్నమైపోయింది, శరీరంలో అవయవాలను ఎవరో కత్తితో విచక్షణారహితంగా కోసేశారు. అది గమనించిన పోలీసులు ఆ మహిళ ఎవరు? ఏంటి? వంటి విషయాలు కనుగొనే పనిలో పడ్డారు.
ఇదిలా ఉండగా ఓ మెక్సికో మహిళ ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి 'ఈమె మా అత్తయ్య, పేరు అరెల్లానో, పెరూలో ఈమె తప్పిపోయింది. ఎవరైనా ఈమె గురించి కనుక్కోవడానికి సహకరించండి అని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చూసిన పోలీసులు ఆమె గురించి కనుక్కోవడానికి ప్రయత్నిస్తుండగా తమకు దొరికిన మృతదేహంతో పోల్చి చూశారు.
అసలు విషయం ఏమిటంటే..
అరెల్లానో ఎప్పటినుంటో పెరూలో ఉన్న హువాచో బీచ్ ను చూడాలని అనుకున్నట్టు ఇంట్లో వాళ్ళతో చెప్పింది. అలాగే ఆన్ లైన్ కోర్ట్ షిప్ లో పనిచేసే 37సంవత్సరాల విల్లాఫుర్టేని కలవాల్సి ఉందని చెప్పింది. కుటుంబ సభ్యులు అందరూ అదే నిజమనుకుని నమ్మారు. కానీ అరెల్లానో తన మేనకోడలితో తాను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతన్ని కలవడానికి వెళుతున్నానని చెప్పి రెండువారాల తరువాత తన ట్రిప్ కు వెళ్ళింది. ఈ విషయాలు అన్నీ ట్విట్టర్ లో తన మేనత్త గురించి పోస్ట్ చేసిన అమ్మాయి పోలీసులకు తెలిపింది. 'తమ కూతురి మరణ వార్త తెలిసేవరకు తను సాధారణ ట్రిప్ కే వెళ్ళిందని మేము అనుకున్నాం, కానీ ఇంత రహస్యం ఉందని అనుకోలేదు, ఇంత ఘోరం జరుగుతుందని అసలు ఊహించలేదు' అని అరెల్లానో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.