అధికారులు సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-11-03T23:13:22+05:30 IST
ప్రజాప్రతినిధులు సూచించే సమస్య లను వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణా సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
- జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణా సుధాకర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ టౌన్, నవంబరు 3 : ప్రజాప్రతినిధులు సూచించే సమస్య లను వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణా సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఏడవ, ఒకటవ స్థాయీ సంఘాల సమావేశాలు జడ్పీ చైర్‌పర్సన్ చాంబర్‌లో నిర్వహిం చారు. అధికారులు తమ విభాగం పనుల వివరాలు ప్రజాప్రతి నిధులకు వివ రించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపి స్తున్నారని గండీడ్, నవాబ్‌పేట జడ్పీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి ఆరోపిం చారు. విద్యుత్ సమస్యలు రెండు మూడు నెలలక్రితం అధికారులకు వివరిం చినా ఇంత వరకు పరిష్కారం కాలేదని అన్నారు. ఎమ్మెల్యే లేఖలు రాసినా పనులు జరగడం లేదని తెలిపారు. కొత్త ట్రాన్స్‌ఫారాలు కావాలని అడిగినా ఇంత వరకు రాలేదని అన్నారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు డీఈ చంద్రమౌళి స్పందిస్తూ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకవస్తా నని, సమస్యలు పరి ష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఆర్.అండ్‌బి రోడ్లు మర మ్మతులకు రూ.7 కోట్ల ప్రతిపాదనలు పంపించాలని ఉత్తర్వులు వచ్చాయని, వర్షాలకు పాడైపోయిన రోడ్లను పరిశీలించి మరమ్మతుల కోసం ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని ఆర్‌అండ్‌బీ అధికారి తెలిపారు. మంజూరైనా రోడ్లకు టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని, బిల్లుల సమస్య ఉన్నందున ఈ పరిస్థితి వచ్చిందని అధికారి వివరించారు. కురుమూర్తి రోడ్డు మరమ్మతులు చేసేందుకు ఎంతో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.