Minister Harishrao: కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇళ్లు చూసారా?..
ABN , First Publish Date - 2022-12-27T12:54:38+05:30 IST
సంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Harishrao) మంగళవారం సంగారెడ్డి జిల్లా (Sangareddy Dist.)లో పర్యటిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Harishrao) మంగళవారం సంగారెడ్డి జిల్లా (Sangareddy Dist.)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోహిర్ మండలం, దిగ్వాల్‌లో డబుల్ బెడ్ రూమ్ (Double Bedroom) ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ (BB Patil), ఎమ్మెల్యే మాణిక్ రావు (MLA Manik Rao), చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చింత ప్రభాకర్ (Chinta Prabhakar), స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇళ్లు చూసారా? అని ప్రశ్నించారు. అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఖాళీ స్థలం ఉన్నవారికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
మాజీమంత్రి గీతారెడ్డి (Gita Reddy) హయాంలో జహీరాబాద్ నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేపటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అవుతాయని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఉన్నటు వంటి సంక్షేమ పధకాలు ఎక్కడ లేవన్నారు. త్వరలో సంగమేశ్వర, బసమేశ్వర సాగునీరు ప్రాజెక్ట్‌లను ప్రారంభించి గోదావరి జలాలను జహీరాబాద్‌కు తరలిస్తామన్నారు. తెలంగాణలో భూముల రేట్లు పెరగడానికి కారణం.. ఇక్కడ జరుగుతున్న అభివృద్దేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.