మున్సిపల్ విలీన గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లివ్వాలి
ABN , First Publish Date - 2022-10-29T23:20:12+05:30 IST
సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా
సంగారెడ్డి రూరల్, అక్టోబరు 29: మున్సిపల్ విలీన గ్రామాలకు సక్రమంగా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షిషా మున్సిపల్ అఽధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావాలని ఆదేశించారు. ఎక్కడైనా పైపులైన్‌లు మరమ్మతులు చేయాల్సి ఉంటే పునరుద్ధరించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, ఇంటింటి సర్వే చేసి కుళాయి కనెక్షన్‌లు క్రమబద్ధీకరించి, నీటి బిల్లులు వసూలు చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ రఘవీర్, ఈఈ, డీఈ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.