సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ హఠాన్మరణం
ABN , First Publish Date - 2022-06-05T17:28:21+05:30 IST
ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ కన్నుమూశఆరు. పరకాలలో మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది.

హన్మకొండ: ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ కన్నుమూశారు. పరకాలలో మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు. మెండు శ్రీనివాస్ హఠాన్మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక తరపున టీఆర్ఎస్ పార్టీ సహా... సీఎంవో బీట్ రిపోర్టర్‌గా శ్రీనివాస్ సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మెండు శ్రీనివాస్ అకాలమరణం దిగ్భ్రాంతిని కలిగించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెండు శ్రీనివాస్ మృతికి మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు.