NCBN Arrest: నారా లోకేష్ క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత.. కారణమేంటంటే..?

ABN , First Publish Date - 2023-09-27T16:27:38+05:30 IST

రాజమండ్రి(Rajahmundry)లోని లోకేష్ క్యాంపు(Lokesh Camp) సైట్ వద్ద ఏపీ పోలీసులు(AP Police) అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల చర్యలతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

NCBN Arrest: నారా లోకేష్ క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత.. కారణమేంటంటే..?

రాజమండ్రి: రాజమండ్రి(Rajahmundry)లోని లోకేష్‌కు సంబంధించిన ప్రత్యేక క్యాంపు(Lokesh Camp) సైట్ వద్ద ఏపీ పోలీసులు(AP Police) అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల చర్యలతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లురు నుంచి టీడీపీ నేత పసుపులేటి సుధాకర్, ఆయన బృందం రాజమండ్రిలోని క్యాంపు సైటులో ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసి సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. కాగా పోలీసులు క్యాంపు లోపలికి అనుమతించకపోవడంతో నాయకులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. భువనేశ్వరి.. బ్రాహ్మణిలను కలిసి సంఘీభావం చెప్పడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు పెట్టారు.

TDP.jpg

పోలీసులు, నేతలకు మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కావాలనే లేనిపోని ఆంక్షలు పెడతున్నారని టీడీపీ నేతలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు మడుగులు అద్దుతున్నారని టీడీపీ క్యాడర్‌ పోలీసుల చర్యలను తప్పు బట్టారు. పోలీసుల చర్యలతో టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. ప్రత్యేక క్యాంప్‌కు ఎదురుగా కూర్చుని కొంతమంది నేతలు ఆందోళన చేస్తున్నారు. టీడీపీ రాజమండ్రి నేత ఆదిరెడ్డి వాసు, అనుచరులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డంపెట్టిన తాళ్లను తొలగించుకుని క్యాంప్ సైట్ వద్దకు నేతలు వెళ్తున్నారు.

Updated Date - 2023-09-27T16:33:46+05:30 IST