APPSC: నిరుద్యోగులకు శుభవార్త... గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
ABN , First Publish Date - 2023-12-07T20:37:52+05:30 IST
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అమరావతి: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.