Share News

Iran Readies Missiles: అమెరికాతో సై అంటే సై అంటున్న ఇరాన్ .. దాడుల కోసం మిసైల్స్ రెడీ

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:25 AM

డొనాల్ట్ ట్రంప్ వైమానిక దాడులు చేస్తామంటూ హెచ్చరించడంతో అప్రమత్తమైన ఇరాన్ తన మిస్సైళ్లను రెడీ చేసుకుంది. ప్రపంచవ్యా్ప్తంగా అమెరికా స్థావరాలను టార్గెట్ చేసేలా క్షిపణులను ఇరాన్ సిద్ధం చేసుకున్నట్టు టెహ్రాన్ టైమ్స్ అనే పత్రిక పేర్కొంది.

Iran Readies Missiles: అమెరికాతో సై అంటే సై అంటున్న ఇరాన్ .. దాడుల కోసం మిసైల్స్ రెడీ
Iran Readies Missiles Against America

ఇంటర్నెట్ డెస్క్: మధ్రప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అణ్వాయుధ అభివృద్ధి కట్టడి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌తో అప్రమత్తమైన ఇరాన్.. ప్రతిదాడుల కోసం మిసైల్స్ రెడీ చేసుకుంటోందని టెహ్రాన్ టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. అమెరికాకు సంబంధించిన ప్రాంతాలను చేరుకునే సామర్థ్యం ఈ మిసైల్స్‌కు ఉందని పేర్కొంది.

దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని భూగర్భ కేంద్రాల్లో ఇరాన్ మిలిటరీ మిసైల్స్‌ను రెడీ చేసుకుంది. వైమానిక దాడులను తట్టుకునేలా ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు చెందిన స్థావరాలను టార్గెట్ చేసే సామర్థ్యం ఈ మిసైల్స్‌కు ఉన్నట్టు టెహ్రాన్ టైమ్స్ పేర్కొంది.


Also Read: డీల్‌కు ఒప్పుకోకపోతే బాంబు దాడులు.. ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక

ఆదివారం డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మధ్యప్రాచ్యంలో కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. అణ్వాయుద్ధ అభివృద్ధి కట్టడి కోసం ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే వైమానిక దాడులు కూడా చేసేందుకు వెనకాడబోమని డొనాల్ట్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. చర్చల కోసం ఇరాన్‌కు లేఖ కూడా రాసినట్టు చెప్పారు. ఇరాన్ మునుపెన్నడూ చూడని రీతిలో బాంబు దాడులు ఉంటాయని అన్నారు. మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు కూడా విధిస్తామని హెచ్చరించారు. దీంతో, అమెరికా దాడులను ప్రతిఘటించేందుకు ఇరాన్ కూడా సిద్ధమైంది.

2015లో ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న జీసీపీఓఏ ఒప్పందం నుంచి ట్రంప్ 2018లో వైదొలగిన విషయం తెలిసిందే. ఇరాన్ అణ్వాయుధ అభివృద్ధిపై కఠిన ఆంక్షలకు అంగీకరించినందుకు ఇరాన్‌కు ఆర్థిక ఆంక్షల నుంచి విముక్తి కల్పిస్తూ అమెరికా అప్పట్లో ఒప్పందం చేసుకుంది. కానీ ట్రంప్ రాకతో పరిస్థితి తారుమారైంది.


Also Read: ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్యం కథ ముగిసింది: తాలిబాన్లు

ఇక తాజా ఉదంతంలో ట్రంప్ ఇరాన్‌తో చర్చలకు తాము సుముఖంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. కానీ ట్రంప్ ఆఫర్‌ను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తోసిపుచ్చారు. అమెరికాతో నేరుగా చర్చలు ఉండవని చెప్పిన ఆయన.. ఒమాన్ మధ్యవర్తిత్వం ద్వారా పరోక్ష చర్చలకు సమ్మతమేనని పేర్కొన్నారు.

‘‘పరోక్ష పద్ధతుల్లో చర్చలు కొనసాగొచ్చని ఇరాన్ సుప్రీం లీడర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మాకు చర్చలను కాదనే ఉద్దేశం లేదు. అయితే, మా పట్ల అన్యాయవైఖరే ఇబ్బందులకు కారణమవుతోంది. ఈ అంశంలో నిర్ణయాలకు సంబంధించి విశ్వసనీయతను పునరుద్ధరించగలమని వారు నిరూపించాలి. ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను’’ అని ఇరాన్ అధ్యక్షుడు అమెరికాను ఉద్దేశించి అన్నారు.

Read Latest and International News

Updated Date - Mar 31 , 2025 | 11:31 AM