ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sajjala: ఆ ఆధారాలను చంద్రబాబు తుడిచేశారు

ABN, First Publish Date - 2023-09-13T17:43:54+05:30

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) గోబెల్స్‌ను నమ్ముకొని నేటికి ముందుకు వెళ్తున్నారని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు.

తాడేపల్లి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) గోబెల్స్‌ను నమ్ముకొని నేటికి ముందుకు వెళ్తున్నారని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు సీఎం క్యాంపు ఆఫీసులో మీడియాతో సజ్జల మాట్లాడుతూ..‘‘గత నాలుగు రోజులుగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కోర్టు సాక్షాధారాలు ఉన్నాయని భావించి జుడీషియల్ కస్టడీకి పంపింది. అయితే ఇంత జరిగినా టీడీపీ పార్టీ, కొన్ని మీడియా సంస్థలు, చంద్రబాబు పెంచి పోషించిన కొందరు వ్యక్తులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. 73ఏళ్ల వృద్ధుడిని హింసిస్తున్నట్టు చూపించే ప్రయత్నం దారుణం. కోర్టు... ఆధారాలు ఉన్నాయి, దీనిలో కుట్ర ఉంది... రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల నష్టం కలిగించారని నమ్మింది.

370 కోట్లు పక్కకు పంపడం దీనికోసం చంద్రబాబు వేసిన వ్యూహలు అందరికీ కనిపిస్తున్నాయి. హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేయడం మానవహక్కులకు భంగం కలిగిందంటే ఎలా..? పక్కా ఆధారాలతో రిమాండ్ రిపోర్టు ఏజెన్సీ ఇచ్చింది. కేంద్ర సంస్ధ కూడా గతంలోనే ఇదే విషయం నిర్థారించింది... అయితే అప్పుడు ఆధారాలను చంద్రబాబు తుడిచేశారు. సెంట్రల్ ఏజెన్సీ ఆధారంగా ఏపీ సీఐడీ(AP CID) దృష్టిపెట్టి డబ్బును హవాలా మార్గం ద్వారా చేరాల్సిన చోటుకు చేర్చింది. చివరకు సిమెన్స్ కంపెనీ తమకు సంబంధం లేదని చెప్పినా దానికి లింక్ పెడతారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల (Enforcement Officers) కు కూడా తాము చేసింది నిజమా అనే అనుమానం వచ్చేలా ఇక్కడ దబాయిస్తున్నారు.టీడీపీ (TDP) దబాయింపులకు మేము సమాధానం చెప్పాల్సి వస్తోంది.

సీమెన్స్ 2019 ఏప్రిల్‌లో తమ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చింది ఈ కేసులో సిమెన్స్ గ్లోబల్ సంస్థ(Siemens is a global company) ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని చెప్పింది. మాకు సంబంధం లేకుండా చేసిన ఎంవోయూ ద్వారా ప్రభుత్వం డబ్బు పోయిందని వారి రిపోర్టులో తెలిపింది. చివరకు ఇచ్చిన 371 కోట్లు అన్ని బిజినెస్ రూల్స్ అన్నింటిని ఉల్లంఘించి విడుదల చేయడంపై అనుమానం ఉందని అభిప్రాయం తెలిపింది. ఆ డబ్బుకోసం వత్తిడి చేయడం.. ఆడబ్బు డిజైన్ టెక్‌కు అక్కడి నుంచి వేరే షెల్ కంపెనీకి వెళ్లాయి. మా దగ్గర 90శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది లేదని సిమెన్స్ చెప్పింది. డిజైన్ టెక్‌కు వెళ్లిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయి అది కేసు కాదా... చంద్రబాబుకు ఇన్ కంట్యాక్స్ నోటీసు ఇచ్చిన విషయం గమనిస్తే అంతా తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్స్ 10 గంటలు పాటు జరిగాయి. ఆ తర్వాతే ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్‌ ఇచ్చింది.అన్ని ఆధారాలతో దొరికితే ఎందుకు చంద్రబాబును అరెస్టు చేయకూడదు.

కాశ్మీరు నుంచి కన్యాకుమారి నుంచి పెద్ద పెద్ద నాయకులతో స్టెట్మెంట్ ఇప్పించారు. పిల్లల భవిష్యత్తు, యువతకు సంబంధించిన ఈ ప్రాజెక్టులో దోచుకుంటే వదిలిపెట్టాలా. చంద్రబాబు రాజ్యాంగానికి అతీతుడా... మీరే చెప్పాలి...ఆయన జైల్లో ఉంటేనే తప్పు అంటే ఎలా...జ్యూడీషియల్ కస్టడీ ఇచ్చాక కూడా ఆయనకు ఇంటి భోజనం, మందులు ఓకే అన్నారు.హౌస్ అరెస్టు కుదరదని మాత్రమే విచారణ సంస్థ అభ్యంతరం తెలిపింది. ఈ కేసు విచారణ చేసే అధికారులు చంద్రబాబుకు ఎంతో మర్యాద ఇచ్చారు. అయినా ప్రజలను అడ్డంపెట్టుకొని ‘‘బాబుతో నేను అని క్యాంపెయిన్’’ ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారు. సానుభూతి, వ్యతిరేఖత, తద్వారా రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు ఈ కేసును చూస్తున్నారు. రాజకీయ కక్షతో చేయాలనుకుంటే ఎప్పుడో చేసుండే వాళ్లం. చంద్రబాబు రిమాండ్ రిపోర్టు(Chandrababu Remand Report) పబ్లిక్ డొమైన్‌లో ఉంది... మీడియా దాన్ని పట్టించుకోవాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.

Updated Date - 2023-09-13T17:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising