KA Paul : 70 శాతం మంది ప్రజలు నన్ను సీఎంగా కోరుకుంటున్నారు..

ABN , First Publish Date - 2023-05-04T13:46:37+05:30 IST

ఏపీలో బీజేపీ లేదని... తెలంగాణలో కేసీఆర్ మద్దతుతో 5శాతం స్థానం పొందారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఏపీలో అవినీతిని అంతం చేయాలన్నారు.

KA Paul : 70 శాతం మంది ప్రజలు నన్ను సీఎంగా కోరుకుంటున్నారు..

విశాఖ : ఏపీలో బీజేపీ లేదని... తెలంగాణలో కేసీఆర్ మద్దతుతో 5శాతం స్థానం పొందారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఏపీలో అవినీతిని అంతం చేయాలన్నారు. సిట్‌ను అవినీతిపై విచారణకు ఆహ్వానించడం హర్షణీయమన్నారు. నాలుగేళ్లలో సిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సీబీఐతో ఎంక్వైరీ కూడా చేయించాలన్నారు. బొత్స లక్ష కోట్ల విలువైన ఆస్తులు వచ్చాయని సిట్‌తో విచారణ జరిపించాలన్నారు. ఏ ప్రభుత్వమైనా ఉచిత విద్య ఎవరికైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. తాను 17 లక్షల మందికి ఇచ్చానన్నారు. ఇంకా కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘‘కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు గెలిపించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తనను ఏపీ ప్రజలు ఎందుకు గెలిపించరు. 60 ,70 శాతం ప్రజలు నన్ను ముఖ్యమంత్రి గా కోరుకుంటున్నారు. త్వరలో 8లక్షల కోట్లు రాష్ట్రానికి తీసుకురావడం చూస్తారు. చంద్రబాబు వస్తే మింగేస్తాడని బీజేపీ పెద్దలకు చెప్పాను. ఎన్డీఆర్ లాంటి ముఖ్యమంత్రి మరొకరులేరు. వైసీపీలో అవినీతిపరులందరినీ విచారించాలి. వైసీపీ పాలనలో ఆదాయం పెరగలేదు కానీ అక్రమాలు, అప్పులు మాత్రం పెరిగాయి’’ అని విమర్శించారు.

Updated Date - 2023-05-04T13:46:37+05:30 IST