Vijayawada: అంగన్‌వాడీల సమ్మెకు సీఐటీయూ మద్దతు
ABN , First Publish Date - 2023-12-12T07:43:04+05:30 IST
విజయవాడ: అంగన్వాడీలు మంగళవారం నుంచి చేపట్టనున్న సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర కమిటి సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్శింగరావు స్పష్టం చేశారు.

విజయవాడ: అంగన్వాడీలు మంగళవారం నుంచి చేపట్టనున్న సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర కమిటి సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్శింగరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, యూనియన్ నేతలతో సరైన పద్ధతిలో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు మూతపడం వల్ల అనేక మంది చిన్నారులు, గర్భిణులు ఇబ్బందులు పడతారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంగన్‌వాడీలు చేసే ప్రతి పోరాటానికి సిఐటియు మద్దతు ఉంటుందని నాగేశ్వరరావు, నర్సింగరావు స్పష్టం చేశారు.