Amaravathi: ఏప్రిల్ 3వ తేదీన కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు నిరాశే..

ABN , First Publish Date - 2023-04-03T16:41:38+05:30 IST

అమరావతి: ఏప్రిల్ 3వ తేదీన కూడా ఏపీ (AP) ఉద్యోగులకు (Employees), పెన్షనర్లకు (Pensioners) నిరాశే మిగిలింది. ఎవరికీ జీతాలు, పెన్షన్‌లు పడలేదు.

Amaravathi: ఏప్రిల్ 3వ తేదీన కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు నిరాశే..

అమరావతి: ఏప్రిల్ 3వ తేదీన కూడా ఏపీ (AP) ఉద్యోగులకు (Employees), పెన్షనర్లకు (Pensioners) నిరాశే మిగిలింది. ఎవరికీ జీతాలు (Salaries), పెన్షన్‌లు (Pensions) పడలేదు. ఖజానా ఖాళీ కావడంతో నిధుల వేటలో జగన్ సర్కార్ (Jagan Govt.) ఉంది. రేపు (మంగళవారం) రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) వద్ద సెక్యూరిటీ బాండ్ల (Security Bonds) వేలం (Auction) ద్వారా రూ. 3 వేల కోట్లు అప్పు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆర్‌బీఐ (RBI)లో ఓడీ, వేస్ అండ్ మీన్స్ కింద ఏపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. దీంతో రేపటి బాండ్ల వేలం నిధులు కూడా ఆర్‌బీఐ జమ చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో నిధులు లేక ఎవ్వరికీ జీతాలు, పెన్షన్‌లు అందలేదు. కాగా ఎఫ్‌ఆర్‌బిఎం కింద 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఇంకా ఏపీ ప్రభుత్వానికి అనుమతులు రాలేదు.

Updated Date - 2023-04-03T16:41:38+05:30 IST