ఆత్కూరు ఎస్సైగా సూర్యశ్రీనివాస్
ABN , First Publish Date - 2023-01-13T00:58:01+05:30 IST
ఆత్కూరు నూతన ఎస్సైగా టి. సూర్యశ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

ఉంగుటూరు: ఆత్కూరు నూతన ఎస్సైగా టి. సూర్యశ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి ఎస్సైగా హనుమాన్‌జంక్షన్ ఎస్సై వి.వెంకటేశ్వరరావు పనిచేశారు. ప్రస్తుతం హనుమాన్‌జంక్షన్-1 ఎస్సైగా పనిచేస్తున్న టి.సూర్యశ్రీనివాస్ ఎస్సైగా ఇక్కడకు బదిలీపై వచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు మాదకద్రవ్యాల నియంత్రణకు కృషిచేస్తానని ఎస్సై అన్నారు. సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.