‘మహాశక్తి’తో మహిళలకు పెద్దపీట
ABN , First Publish Date - 2023-08-05T22:40:07+05:30 IST
అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేసి, వారిని ఆదుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తన మొదటి మేనిఫెస్టోలో మహాశక్తి పథకాన్ని రూపొందించారని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలోని రామపురంలో శనివారం మహాశక్తి కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా మాజీ ఎ

పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
150 కుటుంబాలు టీడీపీలో చేరిక
కొడవలూరు ఆగస్టు 5 : అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేసి, వారిని ఆదుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తన మొదటి మేనిఫెస్టోలో మహాశక్తి పథకాన్ని రూపొందించారని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలోని రామపురంలో శనివారం మహాశక్తి కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మహాశక్తి పథకంపై అవగహన కల్పిస్తూ గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతున్నదని, పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యులకు పూటగడవక అల్లాడిపోతున్నారని ఆరోపించారు. మాజీ సీఎం చంద్రబాబుపై పుంగనూరులో దాడి చేయడం హేయమని చర్య అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో సుమారు 150 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, కేతూ వెంకటరమణారెడ్డి, గరికపాటి రాజేంద్రకుమార్, నాసిన ప్రసాద్, బడుగు శ్రీనివాసులు, నాగభూషణం,స్నేహలత తదితరులు పాల్గొన్నారు.
-----------------