Share News

Breaking News: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

ABN , First Publish Date - Mar 27 , 2025 | 08:25 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
Breaking News

Live News & Update

  • 2025-03-27T16:41:28+05:30

    కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

    • కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ శాసనసభలో కామెంట్స్ చేసిన కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

    • తాము నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు.

    • చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు.

    • డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు.

    • 16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదు.

    • లైట్లు ఆన్‌లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారు.

    • కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు.

    • వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు. అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా.

    • నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు.

    • చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

    • రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదా.

    • అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు.

    • నిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారు.

    • కానీ ఆ పని నేను చేయలేదు. మేం విజ్ఞత ప్రదర్శించాం.

    • ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించా.

    • సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా.. చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా.

    • ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది.

  • 2025-03-27T13:22:35+05:30

    డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

    • తీర్మానాన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టిన తెలంగాణ సీఎం రేవంత్‌

    • డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని తెలంగాణ అసెంబ్లీ తీవ్రంగా ఖండిస్తోంది: రేవంత్‌రెడ్డి

    • డీలిమిటేషన్‌ వల్ల జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదు: సీఎం రేవంత్‌

    • ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలి: సీఎం రేవంత్‌

    • తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలి: రేవంత్‌

    • జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి: సీఎం రేవంత్‌

    • 2026లో జనాభా లెక్కలు చేపట్టి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది: సీఎం రేవంత్‌

    • 1971 తర్వాత జనాభా నియంత్రణ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేశాయి: రేవంత్‌

    • కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగలేదు: రేవంత్‌

    • డీలిమిటేషన్‌ అనేది సౌత్‌కు లిమిటేషన్‌గా మారే ప్రమాదం ఉంది: సీఎం రేవంత్‌

    • కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనం కోసం జమ్మూకశ్మీర్‌, అసోంలో నియోజకవర్గాలు పెంచారు: రేవంత్‌

    • పునర్విభజన చట్టంలో సీట్లు పెంచాలని స్పష్టంగా ఉంది: సీఎం రేవంత్‌

    • ఆర్థిక ప్రయోజనాలతోపాటు ఉద్యోగ, ఉపాధి అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగేలా ఉంది: రేవంత్‌

    • లోక్‌సభ సీట్లను కూడా పునర్విభజన చేసేలా కేంద్రం ఉంది: సీఎం రేవంత్‌

    • అదే జరిగితే దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయి: సీఎం రేవంత్‌

  • 2025-03-27T13:11:45+05:30

    సీఎం చంద్రబాబు కాళ్లపై పడ్డ ఎమ్మెల్సీ..

    • అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఆసక్తికర ఘటన

    • ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఆయన కాళ్ల మీదపడ్డ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

    • ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ

    • ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవి ఇస్తాననటంతో వైసీపీకి వెళ్లిన జయమంగళ

    • గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

    • శాసన మండలి ఛైర్మన్ వద్ద ఇంకా పెండింగ్‌లోనే జయమంగళ రాజీనామ

  • 2025-03-27T12:54:25+05:30

    పోలవరం రైతుల త్యాగాలు మరువలేం: సీఎం చంద్రబాబు

    • రైతుల త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు: సీఎం చంద్రబాబు

    • మొన్నటి వరకూ నిర్వాసితులను పట్టించుకున్న నాథుడే లేడు: సీఎం చంద్రబాబు

    • పోలవరం కోసం 7 మండలాలు ఏపీలో కలపాలని అప్పట్లో ప్రధాని మోదీని కలిసి ఒప్పించాం: చంద్రబాబు

    • జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.10 లక్షల పరిహారం ఇస్తామన్నారు: సీఎం చంద్రబాబు

    • జగన్‌ అధికారంలోకి వచ్చాక పైసా కూడా ఇవ్వలేదు: చంద్రబాబు: సీఎం చంద్రబాబు

    • వరదలు వచ్చినప్పుడు కూడా జగన్‌ పట్టించుకోలేదు: చంద్రబాబు: సీఎం చంద్రబాబు

    • ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును జగన్‌ పక్కన పెట్టారు: చంద్రబాబు

    • 2019లోనూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఎప్పుడో పూర్తయ్యేది: చంద్రబాబు

    • ఆలస్యం కావడంతో పోలవరం ఖర్చు భారీగా పెరిగింది: సీఎం చంద్రబాబు

    • ఐదేళ్లలో 33 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించా: సీఎం చంద్రబాబు

  • 2025-03-27T11:59:16+05:30

    తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌

    • కాగ్‌ రిపోర్ట్‌ను సభలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

    • గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు: కాగ్

    • 2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి రూ. 49,618 కోట్ల అప్పులు

    • గత ఏడాది కాలంలో 200 శాతం FRBM పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్

    • పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ.2 లక్షల 20 వేల కోట్లు

    • వేతనాల కోసం రూ.26,981 కోట్లు ఖర్చు: కాగ్‌ రిపోర్ట్‌

    • ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.89 శాతం నిధులు

    • 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.9,934 కోట్లు

    • రెవెన్యూ రాబడుల్లో 45% వేతనాలు వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు

    • 2023-24లో రెవెన్యూ మిగులు రూ.779 కోట్లు, లోటు రూ49,977 కోట్లు

    • జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 3.33 శాతం: కాగ్‌ రిపోర్ట్‌

    • 2023-24 ముగిసే వరకు రుణాలు మొత్తం రూ.4,03,664 కోట్లు

    • జీఎస్టీపీలో అప్పుల శాతం 27 శాతంగా ఉంది: కాగ్‌

    • 2023-24 వరకు గ్యారంటీలకు మొత్తం రూ.2,20,604 కోట్లు

    • 2023-24లో తీసుకున్న రూ.50,528 కోట్లతో..

    • రూ.43,918 కోట్లు మూలధనం వ్యయంపై ఖర్చు: కాగ్‌

    • 2023-24లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు రూ.76,776 కోట్లు

    • 11% పెరుగుదల స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం నిధులు

    • 2022-24లో ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.53,144 కోట్లు: కాగ్‌

  • 2025-03-27T11:18:14+05:30

    రసవత్తరంగా మారిన కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక

    • కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన 8 మంది వైసీపీ ఎంపీటీసీలు

    • ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఏడుగురు ఎంపీటీసీలు

    • 10 మంది MPTCలతో ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే నానాజీ

    • వైసీపీ తీరుతో ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం

  • 2025-03-27T11:11:30+05:30

    పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం హైదరాబాద్‌కు తరలింపు

    • హైదరాబాద్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించిన కుటుంబసభ్యులు

    • సికింద్రాబాద్‌లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వద్దకు ప్రవీణ్ పగడాల పార్థివదేహం తరలింపు

    • సాయంత్రం 4 గంటలకు తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధి తోటలో అంత్యక్రియలు

    • పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

    • పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని హోంమంత్రి, డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశం

    • రాజమహేంద్రవరం చాగల్లులో క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లిన పాస్టర్

    • ద్విచక్రవాహనంపై వెళ్తూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల

    • పాస్టర్ ప్రవీణ్‌ ప్రమాదానికి గురైన సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు

    • పాస్టర్ మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు

  • 2025-03-27T10:29:43+05:30

    హైకోర్టుకు చేరిన టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం

    • నల్లొండ: హైకోర్టుకు చేరిన నల్గొండ జిల్లా నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం

    • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన శాలిగౌరారానికి చెందిన ఓ విద్యా్ర్థిని

    • తన డిబార్‌ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్

    • విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రెటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్న విద్యార్థిని

    • ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ

  • 2025-03-27T09:19:09+05:30

    వంశీకి నేడు బెయిల్ వచ్చేనా..

    • విజయవాడ: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‍పై నేడు తీర్పు వెలువరించనున్న సీఐడీ కోర్టు

    • గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్

    • వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీఐడీ వాదనలు

    • రాజకీయ కారణాలతో కేసు పెట్టారని, వంశీ అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరిన న్యాయవాది

    • మంగళవారం వంశీ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన ఇరువర్గాల వాదనలు

    • రిజర్వ్ చేసిన తీర్పును నేడు వెల్లడించనున్న సీఐడీ కోర్టు

  • 2025-03-27T08:56:22+05:30

    రైతును నరికి చంపిన దుండగులు..

    • తూ.గో.జిల్లా: కొవ్వూరు మండలం దొమ్మేరులో దారుణం

    • పెండ్యాల ప్రభాకర్ అనే రైతును దారుణంగా హత్య చేసిన దుండగులు

    • రైతును వేట కొడవళ్లతో నరికి చంపిన నలుగురు దుండగులు

    • సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • 2025-03-27T08:53:57+05:30

    చెరువులో పడి విద్యార్థి మృతి..

    • గుంటూరు: వట్టిచెరుకూరు చెరువులో పడి విద్యార్థి మృతి

    • బీసీ హాస్టల్‌‌లో నీళ్లు రాకపోవడంతో చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు

    • ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఓ విద్యార్థి మృతి

    • విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురైన బాలుడి కుటుంబం

  • 2025-03-27T08:46:35+05:30

    భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి..

    • భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో తాపీ మేస్త్రి కామేశ్ చికిత్సపొందుతూ మృతి

    • బుధవారం ఆరంతస్తుల భవనం కూలిన ఘటనలో గాయపడిన కామేశ్

    • ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ నేడు మృతి

    • కూలిన భవనం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

    • శిథిలాల కింద ఎంత మంది ఉన్నారనే దానిపై రాని స్పష్టత

  • 2025-03-27T08:30:55+05:30

    SLBC టన్నెల్‌లో దుర్వాసన..

    • SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ

    • మరోచోట దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది

    • కొనసాగుతున్న టీబీఎం మిషన్‌ కటింగ్‌

    • మట్టి, నీటిని తోడుతున్న రెస్క్యూ టీమ్‌

    • ప్రతి 2.5 కిలోమీటర్లకు పంపింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు

  • 2025-03-27T08:29:47+05:30

    ఎన్నిక నేడే..

    • నేడు కడప జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక

    • ఇప్పటికే క్యాంప్‌లో ఉన్న వైసీపీ జెడ్పీటీసీలు

    • స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు

    • మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పిన కోర్టు

  • 2025-03-27T08:25:36+05:30

    రెచ్చిపోయిన దాడి దోపిడీ దొంగలు..

    • అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గంలో రెచ్చిపోయిన దారి దోపిడీ దొంగలు

    • ఆమిద్యాల, వజ్రకరూర్‌లో పెట్రోల్ బంకులపై దాడి చేసి భారీగా చోరీ

    • ఆమిద్యాలలో పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించి రూ.2.20లక్షలు అపహరణ

    • వజ్రకరూరులో పెట్రోల్ బంకుపై దాడి చేసి రూ.1.50లక్షలు దోపిడీ

    • ముఖానికి మాస్కులు ధరించిన ఆరుగురు దోపిడీకి పాల్పడినట్లు చెబుతున్న సిబ్బంది

    • పెట్రోల్ బంక్‌ల సిబ్బందిపై దాడి చేసి సీసీ కెమెరాలు పగులగొట్టి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లిన దుండగులు

    • బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు