Viral Video: టెంట్ కింద పంట కోత.. వీళ్ల తెలివి మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Mar 27 , 2025 | 08:36 AM
కొందరు యువకులు గోధుమ పంట కోసే పనులు చేస్తుంటారు. అయితే ఎండ ఎక్కువగా ఉండడంతో వినూత్నంగా ఆలోచించారు. ఎండ తగలకుండా పని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. చివరకు వారు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఇక పొలం పనులు చేసే వారు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఎండను భరిస్తూనే పని చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. కొందరు యువకులు పొలం పనులు చేసే సమయంలో ఎండ తగలకుండా వినూత్నంగా ఆలోచించారు. వీళ్లు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘టెంట్ కింద పంట కోత.. ఐడియా అద్భుతంగా ఉందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు (Wheat harvest) గోధుమ పంట కోసే పనులు చేస్తుంటారు. అయితే ఎండ ఎక్కువగా ఉండడంతో వినూత్నంగా ఆలోచించారు. ఎండ తగలకుండా పని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారికి ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది.
ఆలోచన వచ్చిందో తడవుగా ఆచరణలో పెట్టేశారు. ఏకంగా టెంట్‌నే ఎత్తుకొచ్చి పొలంలో వేశారు. దాని నీడ కింద (Harvesting under a tent) ఉన్న పంటను మొత్తం కోశారు. తర్వాత టెంట్‌ను ముందుకు జరుపుతూ పంటను కోస్తూ వచ్చారు. ఇలా గోధుమ పంట మొత్తం టెంట్ కిందే కోసేశారు. వీరి విచిత్రమైన ఐడియా చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘టెంట్ కింద పంట కోత.. ఐడియా అదిరిపోయిందిగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2900కి పైగా లైక్‌లు, 2.82 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Rhino vs Animals: జంతువులతో పోటీ పడ్డ ఖడ్గమృగం.. దేనికి భయపడిందో చూస్తే షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..