MMTD Trains: మహిళల బోగీల్లో పోలీసు పహారా..
ABN , Publish Date - Mar 27 , 2025 | 09:06 AM
హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ల మహిళా బోగీల్లో పోలీస్ పహారాను ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన సంఘటనతో అధికారులు లీస్ పహారాను ఏర్పాటు చేశారు.

- ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రతా చర్యలు
హైదరాబాద్ సిటీ: ఎంఎంటీఎస్ రైళ్ల(MMTD Trains)లో ప్రయాణికుల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) దృష్టి సారించింది. ఇటీవల మేడ్చల్ వెళుతున్న రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటనతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జీఎం అరుణ్‌కుమార్ జైన్ ఆదేశాల మేరకు ఉదయం, రాత్రి వేళల్లో ఎంఎంటీఎస్ రైళ్లలోని ప్రతీ మహిళా బోగీకి ఒకరిద్దరు ఆర్పీఎఫ్ లేదా జీఆర్‌పీఎఫ్ మహిళా పోలీసు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 6.10గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు బయల్దేరిన ఎంఎంటీఎస్‌లో పోలీసు సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ వార్తను కూడా చదవండి: Haragopal: హెచ్‌సీయూ భూమి వేలం సరికాదు..
ఇలా చేస్తే మేలంటున్న ప్రయాణికులు
కొవిడ్‌కు ముందు ఉన్న షెడ్యూల్ ప్రకారం సమయాలను పాటి స్తూ 121 సర్వీసులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రద్దీ సమయాల్లో (ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9వరకు) గూడ్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల(Goods, Express trains) కంటే ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఆదాయం తగ్గుతోందని భావిస్తే, సహేతుకంగా చార్జీల పెంపుపై ఆలోచించవచ్చునని ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు, విద్యార్థులు వారాంతాల్లో కూడా ప్రయాణిస్తారు కనుక శని, ఆదివారాల్లోనూ రైళ్ల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. సర్వీసుల పెంపు, సమయపాలన, భద్రత వంటి అంశాల్లో లోకల్ రైళ్లకు ప్రాధాన్యతను ఇవ్వాలని కోరుతున్నారు.
తనిఖీ అధికారులు ఏరి?
టికెట్లు లేకుండా ప్రయాణించే, ఆకతాయిలు, నిబంధనలకు విరుద్ధంగా మహిళల కోచ్‌లలోకి ప్రవేశించే వారిని అడ్డుకునేందుకు అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. కానీ ఎంఎంటీఎస్ రైళ్లలో వారు కనిపించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయ రంగు
Read Latest Telangana News and National News