ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే గొడవలు
ABN , First Publish Date - 2023-04-24T22:01:51+05:30 IST
రాజుపాళెంలో గొడవలను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డే వెనుకుండి ప్రోత్సహిస్తున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు.

- దినేష్‌రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం,ఏప్రిల్24: రాజుపాళెంలో గొడవలను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డే వెనుకుండి ప్రోత్సహిస్తున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు. రాజుపాళెంలో టీడీపీ నాయకుడిపై జరిగిన దాడి, ఆస్తినష్టంపై సోమవారం సీఐకి ఫిర్యాదు చేసేందుకు ఆయన బుచ్చికి వచ్చారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక నాయకుడు వీరి చలపతి ప్రెస్‌మీట్‌లో నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడారని, అలా మాట్లాడడం మాకు చేతకాదన్నారు. వారంలోపు దాడులు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని, తమపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు ఎంవీ శేషయ్య, హరికృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, హరనాథ్, వెంకటేశ్వర్లు, కొండయ్య, కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.
----------