PF withdrawal From ATM: ఏటీఎం నుంచి పీఎఫ్ సొమ్ము
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:14 AM
పీఎఫ్ ఖాతా నుంచి సొమ్ము విత్‌డ్రా ప్రక్రియను కేంద్రం సులభతరం చేసింది. ఇకపై యూపీఐ, ఏటీఎం ద్వారా రూ.1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది.

జూన్ నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు
యూపీఐ ద్వారా పీఎఫ్ ఖాతాలోని
నిల్వను చూసుకునే అవకాశం
కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా
న్యూఢిల్లీ, మార్చి 25: ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లోని సొమ్ము తీసుకునే ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ కేంద్ర కార్మిక శాఖ నిర్ణయం తీసుకొంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) చేసిన సిఫార్సుల మేరకు ఇకపై ఏటీఎంతోపాటు, ఫోన్ పే వంటి యూపీఐల ద్వారా కూడా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కలిగించింది. మే చివరి వారం నుంచి గానీ, జూన్ మొదటి వారం నుంచిగానీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల కార్యదర్శి సుమితా దావ్రా వెల్లడించారు. తొలుత రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉందని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చని చెప్పారు. పీఎఫ్ ఖాతాలోని నిల్వను యూపీఐ ద్వారా చూసుకునే సౌకర్యం కూడా కల్పించినట్టు తెలిపారు. ఇళ్ల నిర్మాణం, విద్య, ఆరోగ్యం, వివాహం వంటి అవసరాల నిమిత్తం చాలా సులువుగా సొమ్మును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కలిగించినట్టు వివరించారు. దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే పీఎఫ్ ఖాతా నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ప్రక్రియను మరింత సరళతరం చేయనున్నట్టు వివరించారు. 95శాతం క్లెయిమ్‌లు ఆటోమేటెడ్ విధానంలో జరుగుతున్నాయని చెప్పారు. పెన్షనర్లు కూడా ఏ బ్యాంకు నుంచయినా సొమ్ము తీసుకునే సౌకర్యాన్ని కలిగించినట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ