Laxmiparvathi: పవన్ కళ్యాణ్ అంటే నాకు సానుభూతి

ABN , First Publish Date - 2023-06-27T11:48:11+05:30 IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పాలన అద్భుతమని రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు.

Laxmiparvathi: పవన్ కళ్యాణ్ అంటే నాకు సానుభూతి

నెల్లూరు: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పాలన అద్భుతమని రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి (AP Telugu Academy chairperson Laxmi Parvathi) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడతూ... చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) అధికారంలోకి వచ్చాకా ఎటువంటి అభివృద్ధి జరగలేదని.. అన్ని అబద్దాలు చెప్పి పాలన ముగించారని విమర్శించారు. గతంలో వైఎస్సార్‌ ఎంతో అద్భుతంగా పాలన చేశారని.. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy)తన మేనిఫెస్టోలలో చెప్పిన పధకాలన్నీ 99.5శాతం పూర్తి చేశారన్నారు. గత ప్రభుత్వాలు తమ పాలనలో 5 శాతం కూడా తమ మేనిఫెస్టో పూర్తి చేయలేదని అన్నారు. పోలవరం పనుల్లో చంద్రబాబు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పెన్నా ఆనకట్ట పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు టీడీపీ ఎక్కడా లెక్కలు చూపలేదని వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఇసుక దోపిడీ చేసిందంటూ..అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ గతంలో లక్షలు కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఏపీ ఐటీ రంగం పరుగులు పెడుతోందని, విద్య వైద్య రంగంలో వైసీపీ ప్రభుత్వం ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు తన తనయుడిని కూడా సరైన మార్గంలో పెంచలేదని విమర్శించారు. రూ.60 కోట్లు ఇచ్చి సర్టిఫికెట్‌లు కొని ఇతర దేశాల్లో చదువుకొన్నాడని అందరికి తెలుసని అన్నారు. పుత్రుడు, దత్త పుత్రుడు ఇద్దరూ హాంతకుల్లా మాట్లాడుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవడం, రాయటం రాని లోకేష్ (TDP Leader Nara Lokesh) పాదయాత్ర చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పవన్ అమాయకుడని.. ఆయన అంటే తనకు సానుభూతి అని అన్నారు. పవన్‌ను చంద్రబాబు వాడుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వారసులు రాజాకీయాల్లోకి వస్తే ఆదరించాలని లక్ష్మీపార్వతి కోరారు.

Updated Date - 2023-06-27T14:47:34+05:30 IST