రెండు వార్డుల్లో టీడీపీ మద్దతుదారుల ఏకగ్రీవం

ABN , First Publish Date - 2023-08-14T21:58:09+05:30 IST

మండలంలోని వీరనకొల్లు పంచాయతీ మూడోవార్డుకు నలగర్ల అనిత, వెలగపాడు పంచాయతీ ఐదోవార్డుకు పువ్వాడ శేషమ్మలు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌అధికారులు జీ వీరరాఘవులు, జీ వెంకటేశ్వ

రెండు వార్డుల్లో టీడీపీ మద్దతుదారుల ఏకగ్రీవం
14కెఎల్‌జి1 : వీరనకొల్లులో ఎన్నిక పత్రం అందుకుంటున్న నలగర్ల అనిత

కలిగిరి, ఆగస్టు 14: మండలంలోని వీరనకొల్లు పంచాయతీ మూడోవార్డుకు నలగర్ల అనిత, వెలగపాడు పంచాయతీ ఐదోవార్డుకు పువ్వాడ శేషమ్మలు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌అధికారులు జీ వీరరాఘవులు, జీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పంచాయతీల్లో ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, వీరికి సోమవారం ధ్రువపత్రాలు అందించినట్లు తెలిపారు. రెండుచోట్ల టీడీపీ మద్దతుదారులు ఎన్నిక కావడం పట్ల మండల కన్వీనర్‌ బిజ్జం కృష్ణారెడ్డి, నాయకులు లెక్కల రాంబాబు, కర్నాటి ప్రభాకర్‌లు వారికి అభినందనలు తెలిపారు.

కొండాపురంలో రెండు వార్డులు ఏకగీవ్రం

కొండాపురం : మండలంలో మూడు పంచాయతీ వార్డుల నామినేషన్ల విత్‌డ్రాకు సోమవారం గడువు ముగిసింది. శెట్టిపాలెం ఆరవవార్డుకు ఒక్క నామినేషన్‌ రావడంతో ఏకగ్రీవమయినట్లు అధికారులు ప్రకటించారు. గానుగపెంట 7 వవార్డుకు నలుగురు నామినేషన్‌ వేయడంతో ముగ్గురు ఉపసంహరించుకోగా కొమ్మి అన్నపూర్ణమ్మను ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. సాయిపేట 3 వవార్డుకు ఐదుగురు నామినేషన్లు వేయగా, ఈనెల 19వ తేదీన ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలియచేశారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-08-14T21:58:43+05:30 IST

News Hub