సర్వేపల్లిలో జనం కోసం ‘జనసేన’
ABN , First Publish Date - 2023-05-14T23:21:48+05:30 IST
మండలంలోని సర్వేపల్లి పంచాయతీ లింగంగుంటలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు చేపట్టారు.

వెంకటాచలం, మే 14 : మండలంలోని సర్వేపల్లి పంచాయతీ లింగంగుంటలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు చేపట్టారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. అనంతరం బొబ్బేపల్లి మాట్లాడుతూ లింగంగుంటలో గత 50ఏళ్లకుపైగా గిరిజనులు నివాసం ఉంటున్నారని, వీరికి శ్మశాన స్థలం లేదన్నారు. అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. గిరిజనుల సమస్య పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలను విముక్తి చేయడమే జనసేన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, రహీమ్, సాయి, అక్బర్, చిన్న, వంశీ తదితరులున్నారు.
==========