Share News

BCCI : చాలెంజర్‌ ట్రోఫీకి ఏడుగురు తెలుగోళ్లు

ABN , Publish Date - Mar 22 , 2025 | 02:52 AM

బీసీసీఐ సీనియర్‌ మహిళల చాలెంజర్‌ ట్రోఫీకి ఏడుగురు తెలుగు క్రికెటర్లు ఎంపికయ్యారు.

BCCI : చాలెంజర్‌ ట్రోఫీకి ఏడుగురు తెలుగోళ్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బీసీసీఐ సీనియర్‌ మహిళల చాలెంజర్‌ ట్రోఫీకి ఏడుగురు తెలుగు క్రికెటర్లు ఎంపికయ్యారు. ఈనెల 25 నుంచి వచ్చేనెల 8 వరకు ఉత్తరాఖండ్‌లో జరిగే ఈ టోర్నీలో పోటీపడే నాలుగు జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఆంధ్ర నుంచి శరణ్య (టీమ్‌-డి), ఎండీ షబ్నం (టీమ్‌-సి), శ్రీచరణి (టీమ్‌-బి), హెన్రీటా, పావని (టీమ్‌-ఎ), తెలంగాణ నుంచి జి.త్రిష (టీమ్‌-డి), మమత (టీమ్‌-బి)కు చోటు దక్కింది.

Updated Date - Mar 22 , 2025 | 02:52 AM