Share News

T20 Victory: హసన్‌ రికార్డు సెంచరీ

ABN , Publish Date - Mar 22 , 2025 | 02:43 AM

తొలి రెండు టీ20లలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌ కీలకమైన మూడో మ్యాచ్‌లో దుమ్ము రేపింది. ఓపెనర్‌ హసన్‌ నవాజ్‌...

 T20 Victory: హసన్‌ రికార్డు సెంచరీ

  • మూడో టీ20లో పాక్‌ గెలుపు

ఆక్లాండ్‌: తొలి రెండు టీ20లలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌ కీలకమైన మూడో మ్యాచ్‌లో దుమ్ము రేపింది. ఓపెనర్‌ హసన్‌ నవాజ్‌ (45 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105 నాటౌట్‌) రికార్డు సెంచరీతో కదం తొక్కడంతో..శుక్రవారం జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్‌ తొమ్మిది వికెట్లతో నెగ్గింది. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలుత న్యూజిలాండ్‌ 19.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. చాప్‌మన్‌ (94), బ్రేస్‌వెల్‌ (31) సత్తా చాటారు. రౌఫ్‌ మూడు, అబ్బాస్‌ అఫ్రీది, షహిన్‌ షా అఫ్రీది, అబ్రార్‌ అహ్మద్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.


ఛేదనలో హసన్‌తోపాటు కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (51 నాటౌట్‌), మరో ఓపెనర్‌ మహ్మద్‌ హారిస్‌ (41) చెలరేగడంతో పాకిస్థాన్‌ 16 ఓవర్లలోనే 207/1 స్కోరు చేసి ఘన విజయాన్నందుకుంది. హసన్‌ 44 బంతుల్లో మూడంకెల మార్క్‌ చేరడం ద్వారా పొట్టి ఫార్మాట్‌ వేగవంతమైన సెంచరీ చేసిన పాకిస్థాన్‌ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

Updated Date - Mar 22 , 2025 | 03:12 AM