Share News

నగరవనంలో చిరుత

ABN , Publish Date - Mar 22 , 2025 | 02:11 AM

తిరుపతి నగరం కపిలతీర్థంవద్ద గల నగరవనంలో శుక్రవారం చిరుత సంచరించింది.

నగరవనంలో చిరుత

మంగళం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం కపిలతీర్థంవద్ద గల నగరవనంలో శుక్రవారం చిరుత సంచరించింది. ఉదయం 11 గంటల సమయంలో వంతెనపై సేదతీరుతూ ఉండగా సందర్శకులు చూసి భయాందోళనకు గురయ్యారు. వీరి సమాచారంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను గమనించారు. కొద్దిసేపటికి చిరుత అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. నగరవనంలో చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ అధికారి రమేష్‌ తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో నగరవనాన్ని తాత్కాలికంగా మూత వేస్తున్నామని చెప్పారు.

Updated Date - Mar 22 , 2025 | 02:11 AM