Share News

Andhra Athletes: ఖేలో ఇండియాలో ఆంధ్ర పాంచ్‌ పటాకా

ABN , Publish Date - Mar 22 , 2025 | 02:58 AM

ఖేలో ఇండియా పారా క్రీడల్లో తొలిరోజు ఆంధ్ర అథ్లెట్లు 5 పతకాలు కొల్లగొట్టగా, తెలంగాణకు ఒక పతకం లభించింది.

Andhra Athletes: ఖేలో ఇండియాలో ఆంధ్ర పాంచ్‌ పటాకా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా పారా క్రీడల్లో తొలిరోజు ఆంధ్ర అథ్లెట్లు 5 పతకాలు కొల్లగొట్టగా, తెలంగాణకు ఒక పతకం లభించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో రవి (అనకాపల్లి) షాట్‌పుట్‌లో, రవణి (విశాఖపట్నం) 100 మీటర్ల రేసులో చెరో స్వర్ణం.. భవాని (నెల్లూరు) 100 పరుగులో, స్వరాజ్‌ (శ్రీకాకుళం) 100 మీటర్ల రేసులో చెరో రజతం.. బాబు (అనంతపురం) వీల్‌చైర్‌ షాట్‌పుట్‌లో రజతం సాధించారు. తెలంగాణ అథ్లెట్‌ శిరీష 100 మీటర్లలో రజతం నెగ్గింది.

Updated Date - Mar 22 , 2025 | 02:59 AM