Share News

ఎమ్మెల్యే కారును ఢీకొన్న వ్యాన్‌

ABN , Publish Date - Mar 22 , 2025 | 02:07 AM

సీఎం కాన్వాయ్‌లోని ఓ వ్యాన్‌ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కారును ఢీకొంది.

ఎమ్మెల్యే కారును ఢీకొన్న వ్యాన్‌

సీఎం కాన్వాయ్‌లోని ఓ వ్యాన్‌ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కారును ఢీకొంది. సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణంలో పద్మావతి అతిథిగృహం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్‌తో సీఎం వాహనం ముందు వెళ్లిపోగా వెనుక వస్తున్న ఈవో కారు ఆగింది. వెనుకే వస్తున్న ఎమ్మెల్యే కారు వేగాన్ని అదుపుచేస్తూ బ్రేక్‌ వేయడంతో వెనుక ఉన్న వ్యాన్‌ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కారు కూడా ఈవో కారును ఢీకొంది. ఇదే సమయంలో స్వల్పంగా పొగలు కూడా రావడంతో భద్రతాసిబ్బంది ఉలిక్కిపడ్డారు. వాహనం వద్దకు పరుగులపై చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కారు వెనుకభాగం స్వల్పంగా దెబ్బతింది. ఆ వెంటనే కార్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

Updated Date - Mar 22 , 2025 | 02:07 AM