Share News

కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

ABN , Publish Date - Mar 22 , 2025 | 02:08 AM

కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. హార్ధిక్‌ పీటర్స్‌ అనే వ్యక్తి మెయిల్‌ ఐడీ నుంచి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికార మెయిల్‌ ఐడీకి శుక్రవారం ఓ సందేశం వచ్చింది.

కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

ఫేక్‌గా తేల్చిన పోలీసులు

హైరానాపడ్డ ఉద్యోగులు

తిరుపతి(కలెక్టరేట్‌), మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. హార్ధిక్‌ పీటర్స్‌ అనే వ్యక్తి మెయిల్‌ ఐడీ నుంచి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికార మెయిల్‌ ఐడీకి శుక్రవారం ఓ సందేశం వచ్చింది. కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్లు మెసేజ్‌ ఉండడంతో కలెక్టర్‌ ఎస్పీ హర్షవర్ధనరాజుకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు అడిషనల్‌ ఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు కలెక్టరేట్‌కు చేరుకుని సెల్లార్‌ నుంచి ఏడవ అంతస్తు వరకు 2 గంటల పాటు తనిఖీలు చేశారు. బాంబు ఆనవాళ్లు దొరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల తనిఖీలతో ఉద్యోగులు, అధికారులు కొంతసేపు హైరానాపడ్డారు. గతంలో పలు హోటళ్లకు సైతం ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం విదితమే. వరుసగా ఫేక్‌ మెసేజ్‌ చేస్తున్న ఆగంతుకుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 02:08 AM