సంబరాల్లో టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2023-03-18T00:08:13+05:30 IST

తూర్పు రాయలసీమ పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ భారీ మెజారిటీతో ముందజలో ఉండడంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకుంటు న్నారు.

సంబరాల్లో టీడీపీ శ్రేణులు

గిద్దలూరు, మార్చి 17 : తూర్పు రాయలసీమ పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ భారీ మెజారిటీతో ముందజలో ఉండడంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకుంటు న్నారు. టీడీపీ కార్యాలయం వద్ద, జాతీయ రహదారిపై పలుచోట్ల టపాసులు పేల్చి సంబ రాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని సన్మానించి ఆనందం పంచుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి ఫలితంగా శ్రీకాంత్‌ విజయం సాధించాడని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో జాబ్‌ క్యాలెండర్‌పై హామీ ఇచ్చి ముఖ్యమంత్రి కాగానే మరచిపోయాడని, నిరుద్యో గ భృతిని కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేని పరిస్థితి ఉండడంతో జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పట్టభద్రులు ఓటుతో బుద్దిచెప్పారని పేర్కొన్నారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమే అనేందుకు ఇది సంకేతమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు షాన్షావలి, మాజీ అధ్యక్షుడు మస్తాన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌యాదవ్‌, టీడీపీ నాయకులు గోపాల్‌రెడ్డి, రమేష్‌, వెంకటరామిరెడ్డి, శ్రీనివాసులు, బాలచెన్నయ్య, పాల్గొన్నారు.

కంభం : మండలంలోని కందులాపురం సెంటర్‌లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయోత్సవ సంబరాలు ఘనంగా చేశారు. కేక్‌ కట్‌ చేసి టపాసులు పేల్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాసులు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పొదిలి రూరల్‌ : తూర్పు రాయలసీమ పట్టభ ద్రుల ఎన్నికల్లో కంచర్ల శ్రీకాంత్‌ భారీ మెజారి టీతో గెలుపొందిన సందర్భంగా పట్టణంలో అభి మానులకు, కార్యకర్తలకు మాజీ ఎంపీటీసీ ఇమాంమ్‌సా స్వీట్లు పంచిపెట్టారు. శ్రీకాంత్‌ గెలవడం రాష్ట్రానికి శుభసూచకమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాల న్నారు.

తర్లుపాడు : తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యం కావడంతో తర్లుపాడులో టీడీపీ శ్రేణులు సంబరాలు అంబరాన్ని తాకాయి. బస్టాండ్‌ సెంటర్‌లో బాణాసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో మండల యూత్‌ ఉపాధ్య క్షుడు ఎస్‌కే.కైర్‌, గ్రామకమిటీ అధ్యక్షుడు జి.సుబ్బయ్య, టీడీపీ నాయకులు ఈర్ల కాశయ్య, ఈర్ల శీను, ఎస్‌కే కాశీంవలి, ఎస్‌కే.రఫీ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం వైపు దూసుకెళుతున్న క్రమంలో పట్టణంలో టీడీపీ శ్రేణులు శుక్రవారం స్థానిక కంభం కూడలిలో సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి వి.మల్లిఖార్జునరావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ మౌలాలి, కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T00:08:13+05:30 IST