Share News

కన్నుల పండువగా నరకాసుర వధ

ABN , First Publish Date - 2023-11-11T23:23:06+05:30 IST

పట్టణంలోని సింగారపు వీధి వైభవవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి నరకాసుర వధ కన్నులపండువగా జరిగింది. హిందూ ఉత్సవ సమితి, ఆలయ ధర్మకర్తలు గెంబలి శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, సామ్రాట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో తొలుత ఆలయంలో సహస్ర పుష్పార్చన, కుంకుమ పూజలు నిర్వహించారు.

కన్నుల పండువగా నరకాసుర వధ
నరకాసురుని బొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యం, (ఇన్‌సెట్‌లో) నరకాసురునిపై బాణం ఎక్కుపెట్టిన బేబీనాయన

కన్నుల పండువగా నరకాసుర వధ

బొబ్బిలి : పట్టణంలోని సింగారపు వీధి వైభవవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి నరకాసుర వధ కన్నులపండువగా జరిగింది. హిందూ ఉత్సవ సమితి, ఆలయ ధర్మకర్తలు గెంబలి శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, సామ్రాట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో తొలుత ఆలయంలో సహస్ర పుష్పార్చన, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం నరకాసురుని వధను చేపట్టారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన ఆలయంలో పూజలు జరిపిన అనంతరం నరకాసురుని బొమ్మపైకి బాణం ఎక్కుపెట్టారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాదిమంది జనం తరలి వచ్చారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవసమితి అధ్యక్షుడు పెంట స్వామినాయుడు, చెలికాని కేశవ, యెన్నా బాబు, కాజా వేణుగోపాలరావు, సుంకరి సాయిరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-11T23:23:11+05:30 IST