AP News: తహసీల్దారు కార్యాలయంపై వైసీపీ జెండా
ABN , First Publish Date - 2023-06-05T20:35:49+05:30 IST
అనంతపురం జిల్లా (Anantapur District) కుందుర్పి తహసీల్దారు కార్యాలయంపై వైసీపీ జెండాను ఎగురవేశారు. సోమవారం స్పందనకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ జెండాను

కుందుర్పి: అనంతపురం జిల్లా (Anantapur District) కుందుర్పి తహసీల్దారు కార్యాలయంపై వైసీపీ జెండాను ఎగురవేశారు. సోమవారం స్పందనకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ జెండాను చూసి, ప్రభుత్వ కార్యాలయమా లేక వైసీపీ (YCP) కార్యాలయమా అని చర్చించుకున్నారు. ఈ క్రమంలో తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు, పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంపై వైసీపీ జెండా ఎగురవేయడం అధికార పార్టీ బరితెగింపునకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దారు విజయకుమారికి ఫిర్యాదు చేశారు. ఆమె వెంటనే సిబ్బంది చేత వైసీపీ జెండాను తొలగించారు. వైసీపీ జెండాను ఎవరు కట్టిందీ తెలియదని తహసీల్దారు తెలిపారు.