లిథువేనియా గౌరవ కాన్సుల్‌గా కిరణ్‌ దివీ

ABN , First Publish Date - 2023-02-27T02:26:44+05:30 IST

లిథువేనియా హైదరాబాద్‌లో మరో గౌరవ కాన్సులేట్‌ను ప్రారంభించింది. ఈ కాన్సులేట్‌కు గౌరవ కాన్సుల్‌గా దివీస్‌ లాబ్స్‌కు చెందిన కిరణ్‌ సత్‌చంద్ర దివీ నియమితులయ్యారు...

లిథువేనియా గౌరవ కాన్సుల్‌గా కిరణ్‌ దివీ

హైదరాబాద్‌: లిథువేనియా హైదరాబాద్‌లో మరో గౌరవ కాన్సులేట్‌ను ప్రారంభించింది. ఈ కాన్సులేట్‌కు గౌరవ కాన్సుల్‌గా దివీస్‌ లాబ్స్‌కు చెందిన కిరణ్‌ సత్‌చంద్ర దివీ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఈయన గౌరవ్‌ కాన్సుల్‌గా వ్యవహరించనున్నారు. ఆదివారం నాడిక్కడ ఈ కాన్సులేట్‌ కార్యాలయాన్ని లిథువేనియా ఆర్థిక, ఇన్నోవేషన్‌ శాఖ మంత్రి కరోలిస్‌ జెమైటిస్‌ ప్రారంభించారు. కాగా లిథువేనియాకు ఢిల్లీలో రాయబార కార్యాలయం; ముంబై, కోల్‌కతా, బెంగళూరుల్లో గౌరవ కాన్సులేట్‌ కార్యాలయాలున్నాయి. ఆధునిక టెక్నాలజీపరంగా దేశంలోని అగ్రగామి రాష్ర్టాల్లో ఒకటైన తెలంగాణ, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లలో లిథువేనియా అస్తిత్వం పెరగడానికి తన నియామకం దోహదపడుతుందని కిరణ్‌ దివీ అన్నారు. ఈ కార్యక్రమంలో దివీస్‌ లాబ్స్‌ ఎండీ మురళి దివీ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-27T02:26:45+05:30 IST