ఏపీజీవీబీ చైర్మన్‌గా ప్రతాప్ రెడ్డి
ABN , First Publish Date - 2023-06-06T02:33:24+05:30 IST
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) డిప్యూటీ జనరల్ మేనేజర్ కే ప్రతాప్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) చైర్మన్‌గా నియమితులయ్యారు...
హనుమకొండ (ఆంధ్రజ్యోతి): భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) డిప్యూటీ జనరల్ మేనేజర్ కే ప్రతాప్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు చైర్మన్‌గా వ్యవహరించిన కే ప్రవీణ్ కుమార్ నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు. బ్యాంకింగ్ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన ప్రతాప్ రెడ్డి ఇప్పటి వరకు ఎస్‌బీఐ భోపాల్ సర్కిల్.. రియల్ ఎస్టేట్ హౌసింగ్ బిజినెస్ యూనిట్ (ఆర్‌ఈహెచ్‌బీయూ)లో పనిచేశారు. అంతకుముందు ఆయన నిజామాబాద్, హిమాయత్ నగర్ రీజియన్స్.. రీజినల్ మేనేజర్‌గా గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్, మెట్రో శాఖలను పర్యవేక్షించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ శాఖ, రిటైల్ అసెట్స్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ హెడ్‌గా పనిచేశారు.