Turkey Earthquake: టర్కీకి మెక్సికో డాగ్ స్క్వాడ్, రెస్కూ బృందాలు

ABN , First Publish Date - 2023-02-08T17:19:21+05:30 IST

భూకంపంతో అతలాకుతలమై వేలాది మందిని కోల్పోయిన టర్కీకి మెక్సికో స్నేహహస్తం అందించింది. టర్కీలో పేకమేడల్లా కూలిపోయిన వందలాలి ..

Turkey Earthquake: టర్కీకి మెక్సికో డాగ్ స్క్వాడ్, రెస్కూ బృందాలు

న్యూఢిల్లీ: భూకంపంతో అతలాకుతలమై వేలాది మందిని కోల్పోయిన టర్కీ(Turkey)కి మెక్సికో (Mexico) స్నేహహస్తం అందించింది. టర్కీలో పేకమేడల్లా కూలిపోయిన వందలాలి భవనాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీసేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు తమ టీమ్‌లను రంగంలోకి దించింది. మెక్సికోకు వన్నెతెచ్చిన ఫేమస్ 'డాగ్ స్క్వాడ్'తో పాటు సహాయక బృందాలను టర్కీకి ప్రత్యేక విమానంలో పంపింది. 16 శునకాలు, వాటి నిర్వాహకులు (Dog handlers) మంగళవారంనాడు టర్కీ బయలుదేరి వెళ్లినట్టు మెక్సికో విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి మార్సెలో ఎబ్రార్డ్ తెలిపారు. ''మా ప్రాణసమానమైన సహాయక బృందాలు ప్రస్తుతం టర్కీకి వెళ్లాయి'' అని ఆయన అన్నారు.

mexico1.jpg

ప్రత్యేక విమానంలో మెక్సికో ఆర్మీకి చెందిన గాంలింపు, సహాయక నిపుణులు, నావికాదళ సభ్యులు, ఐదుగురు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, రెడ్ క్రాస్‌కు చెందిన 15 మంది సభ్యులు ఉన్నట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. డాగ్ స్క్వా్డ్‌ తో ఒక వీడియోను కూడా ఎడ్వార్డ్ షేర్ చేశారు. ఇందులో బెల్జియన్ మలినోయిస్, ఆస్ట్రేలియాకు చెందిన షీప్‌డాగ్స్, లాబ్రడార్స్ కూడా ఉన్నాయి. మెక్సికో రెడ్ క్రాస్ సభ్యులు, వారి వెంట వెళ్తున్న శునకరాజుల వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.

mexico4.jpg

మెక్సికో సెర్చ్ అండ్ రెస్క్యూ డాగ్‌లకు ఆదేశంలో ఎంతో గౌరవం ఇస్తారు. 2017లో పెను భూకంపం మెక్సికోను కుదిపేసింది. మెక్సికో సిటీలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విషాద సమయంలో శిథిలాల కింద చిక్కుకుపోయిన లెక్కకు మించిన ప్రజలను డాగ్ స్వ్కాడ్‌లు గురించి వారి ప్రాణాలు కాపాడాయి. పసుపురంగు లాబ్రడార్ ఫ్రిదా నేవీలో సేవలు అందిస్తూ ఎంతే పేరు తెచ్చుకుంది. doggy goggles, bootsతో అందర్నీ అలరించే ఫ్రిదా...2022లో కన్నుమూసింది. దాని స్మృత్యర్థం మెక్కికో సిటీలోని నేవీ ప్రధాన కార్యాలయం వెలుపల ఫ్రిదా నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2010 నుంచి 2019లో రిటైర్ అయ్యేంత వరకూ 43 మందిని ఫ్రిదా కాపాడింది.

Updated Date - 2023-02-08T17:21:19+05:30 IST