U.S. Airstrikes: హూతీలపై వైమానిక దాడులు
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:02 AM
యెమెన్ రాజధాని సనాతో పాటు సాద, హొదైదా, బేదా, మారిబ్ ప్రావిన్సుల్లోని హూతీ స్థావరాలపై అమెరికా ఈ దాడులు నిర్వహించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులున్నారని యెమెన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి తెలిపారు.

అమెరికా చర్య..31 మంది మృతి
తక్షణమే దాడులు ఆపాలన్న ఇరాన్
సనా, మార్చి16: యెమెన్‌లో హూతీలను ఏరిపారేసే లక్ష్యంతో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది చనిపోయారు. వంద మందికి పైగా గాయపడ్డారు. యెమెన్ రాజధాని సనాతో పాటు సాద, హొదైదా, బేదా, మారిబ్ ప్రావిన్సుల్లోని హూతీ స్థావరాలపై అమెరికా ఈ దాడులు నిర్వహించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులున్నారని యెమెన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయ జల మార్గాల్లో అమెరికా వాణిజ్య, యుద్ధ నౌకలు స్వేచ్ఛగా తిరగకుండా ఏ ఉగ్రవాద సంస్థా అడ్డుకోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా జరిపిన తాజా వైమానిక దాడులను యుద్ధ నేరంగా భావిస్తామని హూతీలు ప్రకటించారు. మరోవైపు హూతీలకు మద్దతీయడం మానుకోవాలని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. దీనిపై ఇరాన్ గట్టిగా బదులిచ్చింది. ఉగ్రవాద సంస్థల విధానాల రూపకల్పనలో తమ పాత్రమీ లేదన్నారు. దాడులను తక్షణమే నిలిపివేయాలని అమెరికాను కోరారు.
ఇవి కూడా చదవండి..