Severe Storms: అమెరికాలో తుఫాను, టోర్నడోల బీభత్సం
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:09 AM
ఈ విపత్తుల కారణంగా కనీసం 34 మంది మృత్యువాత పడ్డారు. ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగాయి. విద్యుత్ లైన్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఆర్కాన్సాస్ రాష్ట్రంలో ముగ్గురు చనిపోయారని అధికారులు ధ్రువీకరించి,

34 మంది మృతి
న్యూయార్క్, మార్చి 16: అగ్రరాజ్యం అమెరికా టోర్నడోలు, భీకర తుఫాను, బలమైన గాలులు, కార్చిర్చులతో అతలాకుతలమైపోతోంది. ఈ విపత్తుల కారణంగా కనీసం 34 మంది మృత్యువాత పడ్డారు. ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగాయి. విద్యుత్ లైన్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఆర్కాన్సాస్ రాష్ట్రంలో ముగ్గురు చనిపోయారని అధికారులు ధ్రువీకరించి, అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. అలాగే మిస్సోరీలో 12 మంది, మిసిసిపీలో ఆరుగురు, కాన్సా్‌సలో 8 మంది, టెక్సా్‌సలో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. ఓక్లహోమా రాష్ట్రంలో కార్చిర్చు ఘటనలు చెలరేగుతున్నాయి. మార్చిలో వాతావరణ ప్రతికూల పరిస్థితులు సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని టోర్నడోలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, అవి మరింత ప్రమాదకర స్థాయిలో ఉండవచ్చని అమెరికా వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది. టెక్సాస్, కాన్సాస్ రాష్ట్రాల్లో వాటి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అప్రమత్తం చేసింది.
ఇవి కూడా చదవండి..