HD kumaraswamy: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం
ABN , First Publish Date - 2023-08-30T21:19:25+05:30 IST
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ సీనియర్ నేత హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం కారణంగా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బుధవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో ఆయనను జయనగర్‌లోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు.
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ సీనియర్ నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumarawamy) అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం కారణంగా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బుధవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో ఆయనను జయనగర్‌లోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు.
కుమారస్వామి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ పి.శతీష్‌చంద్ర పర్యవేక్షణలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని అపోలో ఆసుపత్రి ఒక హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైద్య చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని, కుమారస్వామి త్వరగా కోలుకోవాలని శ్రేయోభిలాషులంతా ప్రార్ధించాలని కోరింది. కుమారస్వామి గతంలో హార్డ్ సర్జరీ కూడా చేయించుకున్నారు.
కాగా, గత వారం రోజులుగా పార్టీకి చెందిన వరుస కార్యక్రమాల్లో కుమారస్వామి పాల్గొంటున్నారు. మరోవైపు ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి నటిస్తున్న చిత్రం పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన కోలార్‌లో బుధవారం పర్యటించాల్సి ఉండగా, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆ కార్యక్రమం రద్దయింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసుపత్రికి ఫోను చేసిన ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.