Nano liquid DAP : నానో లిక్విడ్ డీఏపీకి కేంద్రం ఆమోదం!
ABN , First Publish Date - 2023-03-05T01:07:43+05:30 IST
నానో లిక్విడ్ డీఏపీకి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఎరువుతో రైతులకు మేలు జరుగుతుందని,

న్యూఢిల్లీ, మార్చి 4: నానో లిక్విడ్ డీఏపీకి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఎరువుతో రైతులకు మేలు జరుగుతుందని, తద్వారా దేశం స్వయం సమృద్ధి దిశగా సాగుతుందని ఆయన అన్నారు. ‘‘ఇప్పటికే నానో లిక్విడ్ యూరియాకు అనుమతులు జారీ చేశాం. తాజాగా నానో డీఏపీకి కూడా అనుమతులిచ్చాం’’ అని అన్నారు. కాగా నానో డీఏపీ, భారత వ్యవసాయ ముఖ చిత్రాన్నే మార్చేస్తుందని ఇఫ్కో ఎండీ యూఎస్ అవస్థీ ట్వీట్ చేశారు. నానో డీఏపీ లిక్విడ్ 500 మిల్లీ లీటర్ల సీసాల రూపంలో దొరుకుతాయని, ఒక్కో సీసా ఖరీదు రూ.600 ఉంటుందని, ఒక బాటిల్ రూ.1350 ఖరీదు చేసే డీఏపీ బస్తాతో సమానం అని గత డిసెంబరులో ఆయన చెప్పారు. కాగా, త్వరలో నానో పొటాష్, నానో జింక్, నానో కాపర్ ఎరువులను కూడా అందుబాటులోకి తెచ్చే యోచనలో ఇఫ్కో ఉంది.