Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:02 PM
Fake Cardiologist: గుండె సమస్యలతో ఆసుపత్రిలో చేరిన రోగులకు నకిలీ వైద్యుడు శస్త్ర చికిత్స చేస్తున్నాడు. ఆ క్రమం వారు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ వ్యవహారంపై సదరు కమిషన్ విచారణ జరిపేందుకు రంగం సిద్దం చేసింది.

భోపాల్, ఏప్రిల్ 06: దేశంలో నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అలాంటి వారి చేతిలో ప్రాణాలు పొగొట్టుకొంటున్న వారి సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. ఇటీవల ఓ వ్యక్తి వైద్యుడిగా అవతారం ఎత్తాడు. ఆ క్రమంలో ఆ నకిలీ వైద్యుడు ఏడుగురి ఉసురు తీశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో దామోహ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. దామోహ్ నగరంలో మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్ రోగులకు శస్త్ర చికిత్స చేయడం ద్వారా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో జాతీయ మనవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) బృందం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టనుంది. అందుకోసం ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీ మధ్య దామోస్ నగరంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుల బృందం పర్యటించనుంది. ఈ బృందానికి ఆ కమిషన్‌లోని సభ్యుడు ప్రియాంక్ కనూంగో నేతృత్వం వహించనున్నారు.
దామోస్‌లోని మిషనరీస్ ఆసుపత్రిలో గుండె సమస్యలతో పలువురు రోగులు చేరారు. వారికి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎన్ జాన్ కామ్ శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే వారు మరణించారు. ఈ నేపథ్యంలో జబల్పూర్‌కు చెందిన దీపక్ తివారీ.. ఎన్‌హెచ్ఆర్‌సీని ఆశ్రయించారు. ఈ ఆసుపత్రిలో డాక్టర్ ఎన్ జాన్ కామ్ అనే వైద్యుడు శస్త్ర చికిత్స నిర్వహించడం వల్ల ఏడుగురు మరణించారని ఫిర్యాదు చేశారు.
అయితే సదరు వైద్యుడు.. తనకు అన్ని విదేశీ అర్హతలు ఉన్నాయని చెబుతున్నారంటూ ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ జరపనుంది. ఈ మేరకు ఎన్‌హెచ్ఆర్‌సీ.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పష్టం చేసింది. మరోవైపు ఏప్రిల్ 7 నుంచి 9 వ తేదీ వరకు తమ బృందం దామోహ్‌లోనే ఉంటుందని.. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయాలనుకేవారు.. చేయ వచ్చని ప్రజలకు ఎన్‌హెచ్ఆర్‌సీ తన ఎక్స్ ఖాతా వేదికగా సూచించింది.
ఇంకోవైపు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనిపై నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుధీర్ కొచ్చర్ స్పష్టం చేశారు. అదీకాక డాక్టర్ ఎన్ జాన్ కామ్ అనే పేరుతో చెలమణి అవుతున్న వ్యక్తి అసలు పేరు విక్రమాదిత్య యాదవ్ అని ఓ చర్చ సైతం స్థానికంగా కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది
Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ
For National News And Telugu News