Ritlal Yadav: రామచరిత మానస్ మసీదులో రాశారంటూ ఆర్జేడీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-06-16T16:54:38+05:30 IST
అట్టడుగు వర్గాలపై విద్వేషాలను వ్యాప్తి చేస్తున్న 'రామచరితమానస్'ను తుగులబెట్టాలంటూ ఆర్జేడీ మంత్రి చంద్రశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న తరుణంలో మరో ఆర్జేడీ నేత, దినాపూర్ ఎమ్మెల్యే రిట్లాల్ యాదవ్ ఆ వివాదాన్ని తిరగదోడారు. రామచరితమానస్‌ను మసీదులో రాశారని రిట్లాల్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాట్నా: అట్టడుగు వర్గాలపై విద్వేషాలను వ్యాప్తి చేస్తున్న 'రామచరితమానస్' (Ramacharitmans)ను తుగులబెట్టాలంటూ ఆర్జేడీ మంత్రి చంద్రశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న తరుణంలో మరో ఆర్జేడీ నేత, దినాపూర్ ఎమ్మెల్యే రిట్లాల్ యాదవ్ (Ritlal Yadav) ఆ వివాదాన్ని తిరగదోడారు. రామచరితమానస్‌ను మసీదులో రాశారని రిట్లాల్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాట నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే చరిత్ర పుస్తకాలను తెచ్చుకుని తనిఖీ చేయాలని సూచించారు. పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీపై మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఎమ్మెల్యే సమాధానమిస్తూ, హిందుత్వ పేరుతో ప్రజల మధ్య కొట్లాట పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇందుకు ఆధారంగా న్యూస్ ఛానెల్స్‌లో వచ్చిన వీడియోలను ఆయన చూపించారు. ఈ క్రమంలోనే ఆయన రామచరిత మానస్ ప్రస్తావన చేస్తూ, రామచరిత మానస్‌ను ఒక మసీదులో రాశారని, కావాలంటే చరిత్ర పుస్తకాలు తెప్పించుకుని చూడవచ్చని అన్నారు.
రిట్లాల్‌కు వివాదాలు కొత్తకాదు...
కాగా, రిట్లార్ యాదవ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. 2022 ఏప్రిల్‌లో రిట్లార్ యాదవ్ ప్రైవేటు గార్డులను ఇద్దరిని అరెస్టు చేసారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
చంద్రశేఖర్ కామెంట్లు పునరావృతం..
బీహార్ ఆర్జేడీ మంత్రి చంద్రశేఖర్ గత జనవరిలో ఒక కాలేజీలో జరిగిన కార్యక్రమంలో రామచరితమానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళిత వర్గాలను అవమానపరిచే రాతలు పుస్తకంలో ఉన్నాయని, వాటిని తగులబెట్టాలని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేగంగా స్పందించారు. ''ఒకరి మత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోరాదు. ప్రజలు తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ రాజ్యంగం ఇచ్చింది. మంత్రిని కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అడిగాను'' అని నితీష్ చెప్పారు.